Ad Code

మొబైల్ వాడకం - జాగ్రత్తలు !


ఆన్లైన్ గేమ్, ఓ టీ టీ లో ఎంటర్టైన్మెంట్ మొదలుకొని ప్రతి విషయాన్ని కూడా మన మొబైల్ పైన ఆధారపడుతూ ఉన్నాము. అయితే కొన్ని మొబైల్ రేడియేషన్ ప్రభావాన్ని ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం మొబైల్ ని సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే వాటి వల్ల రేడియేషన్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందట. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నాము. కాబట్టి వీలైనంత వరకు కాలింగ్ బదులుగా మనం మెసేజ్ ద్వారా మాట్లాడడం మంచిది. లేదంటే మొబైల్ కు బ్లూటూత్ హెడ్ సెట్ ను వాడడం ద్వారా రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల మెదడు పైన రేడియేషన్ ప్రభావం చూపదు. మొబైల్ ఫోన్ ను మనం వాడకాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. అతిగా మొబైల్ ఫోన్ వాడటం వల్ల మనకు ఎనలేని నష్టం కలుగుతుంది.. రేడియేషన్ ప్రమాదమే కాకుండా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేని రాత్రులు లకు కారణాలు కూడా అవుతాయి. రాత్రి సమయాలలో మొబైల్ ను ఆఫ్ చేయడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఉదయం లేవడానికి అలారం కోసం ఈ మొబైల్ ను వాడుతున్నారు. ఇది చాలా చిన్న విషయం కదా అని అందరూ అనుకుంటారు. కానీ అలారం పెట్టి ఫోన్ మీ తల దగ్గర ఉన్నట్లయితే అప్పుడు అత్యధికంగా రేడియేషన్ వెలువడుతుంది. మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేకపోయినప్పుడు మొబైల్ వినియోగం చాలా తగ్గించాలి. మొబైల్ సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు వీలైనంత వరకు మన ఫోన్ సిగ్నల్ కోసం అత్యధికంగా తరంగాలను విడుదల చేయడం జరుగుతుంది అందుచేతనే ఫోన్ సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు వాడకం తగ్గించాలి. మొబైల్ ఫోన్ ను ఎప్పుడు 24 గంటలు జేబులో లేదా పౌచులు అంటిపెట్టుకొని ఉంచుకోవడం తగ్గించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల రేడియేషన్ ను తగ్గించుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu