ఆపిల్ ఐఫోన్లు పనిపై దృష్టి పెట్టడానికి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌లను అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. iOS 15తో ఆపిల్ సంస్థ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఫీచర్‌ని యాక్సెసిబిలిటీ ఆప్షన్‌గా జోడించింది. ఐఫోన్ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఫీచర్‌ని ఉపయోగించడానికి మీ యొక్క ఐఫోన్ తాజా iOS వెర్షన్‌లో ఉందని నిర్ధారించుకోండి. ఈ ఫీచర్ iOS 15 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వాటిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ లో సెట్టింగ్‌లను ఓపెన్ చేసిన తరువాత క్రిందికి స్క్రోల్ చేసి యాక్సెసిబిలిటీ ఎంపికను కనుగొని దాని మీద క్లిక్ చేయ్యాలి. క్రిందికి స్వైప్ చేసి ఆడియో/విజువల్ ఎంపిక కోసం వెతికి దానిపై క్లిక్ చేయండి. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఫీచర్‌ని ఆన్ చేయడానికి కుడివైపు ఎగువ భాగంలో ఉన్న టోగుల్‌పై నొక్కండి. ఇప్పుడు బ్యాలెన్స్‌డ్ నాయిస్, బ్రైట్ నాయిస్, డార్క్ నాయిస్, ఓషన్, రైన్ మరియు స్ట్రీమ్ వంటి ఆరు విభిన్న సౌండ్స్ ఎంపికల మధ్య ఎంచుకోవడానికి సౌండ్స్‌పై క్లిక్ చేయండి.
ఐఫోన్ 'బ్యాక్‌గ్రౌండ్ సౌండ్' !
0
May 29, 2022
Tags