థెరబాడీ థెరఫేస్‌ ప్రో మసాజర్‌


థెరబాడీ థెరఫేస్‌ ప్రో మసాజర్‌తో మర్దన చేయడం వల్ల మొహం మీద ముడతలు తగ్గడమే కాదు, ఒత్తిడి, తలనొప్పి, కండ్లకింద వలయాల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు తయారీదారులు. దవడ నొప్పి లాంటి సమస్యలూ తగ్గుతాయట. ముఖం మీది మృత కణాలను తొలగించడంలోనూ, రక్తప్రసరణ మెరుగుపరచడంలోనూ సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు. చార్జింగ్‌తో పనిచేసే ఈ ఫేస్‌ మసాజర్‌ ఆన్‌లైన్‌ ధర. రూ.30,500.

భేష్‌లెట్స్‌ : ఆధునిక యువత గాజులకంటే బ్రేస్‌లెట్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నది. వెస్ట్రన్‌వేర్‌ మీదికి నప్పేలా 'ఎలాయిస్‌’ పేరుతో ఇసాబెల్‌ మారెంట్‌ సంస్థ నైలాన్‌ బ్రేస్‌లెట్లను రూపొందించింది. చక్కని మెరుపు, మృదువైన ఫినిషింగ్‌ వీటి ప్రత్యేకత. దృఢంగానూ ఉంటాయి. మరింత బలం కోసం సన్నని వెండి పట్టీలు జతచేశారు. వీటి అందమైన అల్లికలూ ఆకట్టుకుంటాయి. లాకెట్లతో కలిపి కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ ధర. రూ.24,430.

Post a Comment

0 Comments