Ad Code

మైక్రాన్ 1.5టీబీ స్టోరేజ్‌తో ఓ మైక్రో ఎస్‌డీ కార్డ్‌ విడుదల !


మెమరీ కార్డ్స్ వినియోగం ఇటీవల ఎక్కువయిందనే విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్, డ్రోన్, గేమ్ కన్సోల్స్, డిజిటల్ కెమెరా వంటి డిజిటల్ డివైజ్‌ల్లో మైక్రోఎస్‌డీ కార్డ్స్ బాగా వినియోగిస్తుంటారు. అయితే ఈ మెమరీ కార్డ్ హైయ్యెస్ట్ స్టోరేజ్ 1 టీబీ (1024జీబీ)గా ఇప్పటి వరకు ఉండేది. ఇప్పుడు దానిని మించిన మెమరీ కార్డ్ అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ చిప్‌మేకర్ మైక్రాన్ 1.5టీబీ స్టోరేజ్‌తో ఓ మైక్రో ఎస్‌డీ కార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ కార్డు అందుబాటులోకి వస్తే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజ్‌ కెపాసిటీ గల మైక్రోఎస్‌డీ కార్డు గా చరిత్ర సృష్టిస్తుంది. మైక్రాన్ ఐ400 పేరుతో లాంచ్ కానున్న ఈ ఎస్‌డీ కార్డు మునుపటి అతిపెద్ద మైక్రో ఎస్‌డీ కార్డ్ కంటే 50 శాతం ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఈ కార్డ్ ప్రత్యేకతలు చూస్తే.. మైక్రాన్ తన 176-లేయర్ 3D NAND టెక్నాలజీని ఉపయోగించి హైయ్యెస్ట్ స్టోరేజ్ కార్డును తయారు చేయగలిగింది. ఇందులో వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. 1.5టీబీ స్టోరేజ్ స్పేస్ ఉండే ఈ మైక్రో ఎస్‌డీ కార్డ్ చౌకగా లేదా సులభంగా లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఈ కార్డుని ఉపయోగించి యూజర్లు ఐదు ఏళ్ల పాటు 24×7 హైక్వాలిటీ కంటెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. సుమారు 228 సంవత్సరాలు ఈ కార్డు ఫెయిల్యూర్ అవ్వదు. ప్రధానంగా ఈ కార్డును వీడియోల స్టోరేజ్ కోసం రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సెక్యూరిటీ డివైజ్‌లతో పాటు మరిన్ని డివైజ్‌లలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఐ400 మైక్రో ఎస్‌డీ కార్డ్ సెకనుకు 4జీబీ వరకు డేటా ట్రాన్స్‌ఫర్‌కు సపోర్ట్ చేయనుంది. 

Post a Comment

0 Comments

Close Menu