Ad Code

గోప్యత పాటించని గూగుల్‌ ఇంజనీర్‌ తొలగింపు !


ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంబంధించి గోప్యత పాటించడం లేదన్న ఆరోపణలతో కంపెనీలో పని చేస్తున్న ఇంజనీర్‌ బ్లేక్‌ లెమోయిన్‌ ను తొలగించింది. ఈ విషయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. బ్లేక్‌ లెమోయిన్‌ గూగుల్‌ సంస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఏఐ అనేది బాట్‌ సెంటింగ్‌గా మారిందని సదరు ఇంజనీర్‌ పేర్కొన్నారు. సంస్థకు సంబంధించిన గోప్యత విధానాన్ని ఇంజనీర్‌ ఉల్లంఘించారని స్పష్టం చేసింది. రీసెచర్చర్‌గా ఉన్న ఇంజనీర్‌ను వేతనంతో కూడిన సెలవుపై ఉంచింది. కాగా, లెమోయిన్‌ సస్పెన్షన్‌ గురించి అడిగినప్పుడు సిబ్బంది విషయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గూగుల్‌ వెల్లడించింది. ప్రాజెక్టు గురించి రహస్య సమాచారాన్ని ఇతర పక్షాలతో పంచుకున్నాడనే ఆరోపణలున్నాయి. కంపెనీకి చెందిన సర్వర్‌లలోని సెంటింట్‌ ఏఐని ఎదుర్కొన్నారనే చర్చకు దారి తీసింది. గూగుల్‌ ఏఐ ఎథిక్స్ గ్రూప్‌లోని మునుపటి సభ్యులైన మార్గరెట్ మిచెల్ వంటి వారితో సంబంధం కలిగి ఉన్నాడని గూగుల్ భావిస్తోంది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయనను కంపెనీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో కాగా అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ ఏఐ ఇంజనీర్ లెమోయిన్‌తో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఏఐకి సంబంధించిన అంతర్గతంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తానని, అయితే కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు తిరస్కరించారని లెమోయిన్‌ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu