Ad Code

ఇంటర్నెట్ లేకున్నా జీమెయిల్ సేవలు !


జీమెయిల్ లో ఆఫ్‌లైన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు  ఇక తమ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, సిగ్నల్ సరిగా లేకపోయినా కూడా మెయిల్స్ పంపవచ్చు, తమకు వచ్చిన మెయిల్స్‌ను కూడా చూసుకోవచ్చు. ఈ మేరకు కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మౌంటెన్ వ్యూ వెల్లడించింది. మౌంటెన్ వ్యూ వెల్లడించిన వివరాల ప్రకారం.. గూగుల్ Google సంస్థ జీ మెయిల్‌లో ఆఫ్‌లైన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా Gmail వినియోగదారులు ఇంటర్నెట్ లేకపోయినా తమకు వచ్చిన మెయిల్స్‌ను చూసుకోవచ్చు.. వాటికి ప్రతిస్పందించవచ్చు. ఈ Gmail ఆఫ్‌లైన్ ఫీచర్‌ను మీరు కూడా సులువుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. అందుకు ఈ కింది స్టెప్స్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా జీ మెయిల్ లోకి సైన్ ఇన్ అవ్వాలి. అయితే ఈ ఆఫ్‌లైన్ ఫీచర్ అనేది కేవలం గూగుల్ క్రోమ్‌లో మాత్రమే పనిచేస్తుందని గూగుల్ వెల్లడించింది. అది కూడా క్రోమ్ నార్మల్ మోడ్‌లోనే పనిచేస్తుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పనిచేయదు. జీమెయిల్ Gmail ఇన్‌బాక్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత సెట్టింగ్స్ లేదా కాగ్ వీల్ బటన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత "See All Settings" ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అనంతరం "ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్‌లో సేవ్ ఛేంజెస్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత మీరు జీ మెయిల్ ఆఫ్‌లైన్‌ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. గూగుల్‌కు చెందిన జీ మెయిల్ సేవల్ని దాదాపు 1.8 బిలియన్ మంది వినియోగిస్తున్నారు. ఈ మెయిల్ క్లయింట్ మార్కెట్‌లో గూగుల్ మెయిల్ 18 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. జీమెయిల్ ను వినియోగిస్తున్న వారిలో దాదాపు 75శాతం మంది మొబైల్స్ లోనే వినియోగిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకునే జీ మెయిల్ ఈ ఆఫ్‌లైన్‌ ఫీచర్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu