టెలికాం రంగంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం 'స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్' అనే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమ సిమ్ నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు తమకు వచ్చిన మిస్డ్ కాల్ ల హెచ్చరికలను చూపిస్తుంది. ఇది ప్రత్యేకమైన ఫీచర్ ఏమి కాదు జియో వినియోగదారులు ఇప్పటికే ఈ మిస్డ్ కాల్ అలెర్ట్ ఫీచర్ ని పొందుతున్నది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌కి వెళ్లి మిస్డ్ కాల్ అలర్ట్‌ల విభాగాన్ని ఎంచుకున్నప్పుడు యూజర్‌లకు ఎయిర్‌టెల్ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లు కనిపిస్తాయి. స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లు అనేది వాస్తవానికి అవసరమైన సర్వీసులలో అతి ముఖ్యమైనది. ఇది టెల్కో వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణం అధికంగా చేసే వారు కొన్నిసార్లు నెట్‌వర్క్ కవరేజీలో లేని ప్రాంతాలలో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన కాల్‌లను కోల్పోతుంటారు. అంతేకాకుండా కాలింగ్ యాప్‌లో రింగ్‌టోన్ వినబడనందున లేదా మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌ను చూడనందున వాటి గురించి ఎప్పటికీ తెలుసుకోలేము. కానీ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లతో వినియోగదారులు తమ సిమ్ నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు వారు మిస్ అయిన ప్రతి కాల్‌ను చూడగలరు. ప్రీపెయిడ్ యూజర్ అయినా లేదా పోస్ట్‌పెయిడ్ యూజర్ అయినా సరే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి 'స్మార్ట్ మిస్డ్ కాల్' సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. యాక్టివ్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని కలిగి ఉన్న ఏ ఎయిర్‌టెల్ వినియోగదారు అయినా వారు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ప్లాన్‌తో సంబంధం లేకుండా ఈ ఫీచర్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ !
0
June 13, 2022