గూగుల్‌కు పోటీగా ఆపిల్ సెర్చ్ ఇంజిన్ ?
Your Responsive Ads code (Google Ads)

గూగుల్‌కు పోటీగా ఆపిల్ సెర్చ్ ఇంజిన్ ?


గూగుల్ సెర్చ్ ఇంజిన్ బాగా పాపులర్ అయింది. గూగుల్‌కు పోటీగా మరో కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది. ఆపిల్ సొంతంగా సెర్చ్ ఇంజిన్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రపంచంలో అగ్రగామిగా మార్కెట్ ను శాసిస్తున్నవి రెండే రెండు ఆపిల్, గూగుల్ కంపెనీలు. ఈ రెండు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ ఇప్పుడు Googleతో పోటీ పడేందుకు రెడీ అయింది. గూగల్ ను తలదన్నే సెర్చ్ ఇంజిన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో Google కన్నా అత్యాధునిక టెక్నాలజీతో ఆపిల్ తీసుకొచ్చింది. నివేదికల ప్రకారం.. Apple కొత్త యూజర్-కేంద్రీకృత వెబ్ సెర్చ్ ఇంజిన్ ప్రకటించే అవకాశం ఉంది. సెర్చ్ ఇంజిన్ ఫంక్షనాల్టీకి Apple జనవరి 2023 వరకు వేచి ఉండాల్సందే. టెక్ బ్లాగర్ రాబర్ట్ స్కోబుల్ WWDC 2023లో Apple ప్రకటించబోయే కొత్త ప్రొడక్టులకు సంబంధించి విషయాలను ముందుగానే ప్రకటించింది.. గూగుల్‌ను ఢీకొట్టే ఒక సెర్చ్ ఇంజిన్‌ను Apple ప్రవేశపెట్టనుందని టాక్. గతంలోనూ అనేక సార్లు Apple సెర్చ్ ఇంజిన్‌ను తీసుకొస్తోందని వార్తలు వచ్చాయి. WWDC 2022 అన్ని సీజన్లలో అత్యంత ఖరీదైన ప్రొడక్టుల లాంచ్ అవుతుందని చెప్పాడు. సెర్చ్ ఇంజిన్‌ను జనవరిలో ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. Apple సరికొత్త iOS 16, iPad OS 16, watchOS, macOS 13ని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AoD) ఫీచర్‌ను తీసుకువస్తుందని భావిస్తున్నారు. Samsung, OnePlus సహా ఇతర బ్రాండ్‌లు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేలను ఇప్పటికే అందిస్తున్నాయి. Apple కంపెనీ మాత్రం iPhone 14 లైనప్‌లో ఈ ఫీచర్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 2022 నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. iPhone 14 Pro మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయని భావిస్తున్నారు. కొత్త వెర్షన్‌లు 1Hz నుంచి 120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌ను అడ్జెస్ట్ చేయగలవు. కొంత మొత్తంలో బ్యాటరీని ఆదా చేయగలవు. AoD ఫీచర్ ప్రారంభమైనప్పుడు రిఫ్రెష్ రేట్ ఆటోమాటిక్‌గా 1Hzకి పడిపోతుంది. Tipster LeaksApple Pro ఆపిల్ WWDCలో M2 మ్యాక్‌బుక్ ఎయిర్ M2 Mac మినీని ప్రారంభించవచ్చని అంచనా వేసింది. ఈ డివైజ్‌లు M1 చిప్, M2 చిప్ ద్వారా పవర్ అందిస్తాయి. MacBook Air 2022తో పాటు, Apple M2 చిప్‌సెట్ Mac Proతో కూడిన కొత్త Mac మినీపై కూడా పని చేస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog