గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు చెందిన సోలార్ కంపెనీ జెన్‌సోల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ కారు తయారీ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. జెన్‌సోల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ రూ.6 లక్షల కంటే తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేయడానికి టెక్నికల్ సపోర్ట్ అందించే యూఎస్ బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ స్టార్టప్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఇటీవల పెట్టుబడిదారులకు తెలిపింది. అయితే యూఎస్ కంపెనీ పేరు లేదా కొనుగోలు కోసం చెల్లించిన ధరను మాత్రం వెల్లడించలేదు. తాము డిజైన్ చేసే ఈవీ కారును రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకే (ఆన్ రోడ్ ప్రైస్) కస్టమర్లకు అందించాలని భావిస్తున్నట్లు జెన్సోల్ ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్మోల్ సింగ్ జగ్గీ చెప్పారు. భారత ఈవి తయారీ పరిశ్రమకు డిస్రప్షన్ అవసరమని, ఇ-కారును రూ.5 లక్షల కంటే తక్కువ ధరకు విక్రయించగలిగితేనే అది జరుగుతుందని, ఆ సవాలును స్వీకరించామని అన్మోల్ సింగ్ జగ్గీ తెలిపారు.
రూ.6 లక్షల్లోపే ఎలక్ట్రిక్ కారు ?
0
July 13, 2022
Tags