Ad Code

ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సాప్ హెచ్చరిక !


వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. అలాంటి మెసేజింగ్ యాప్ టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు, స్కామర్‌లు వివిధ పద్ధతుల ద్వారా యూజర్ల డేటాను తస్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ తరహాలో సర్వీసులను అందిస్తున్నట్లుగా కొన్ని హానికరమైన యాప్‌లను కంపెనీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ గుర్తించింది. “HeyMods” అనే డెవలపర్ నుంచి వచ్చిన “Hey WhatsApp” వంటి యాప్‌లు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. ఇలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దని Cathcart సూచించింది. ఈ యాప్‌ల ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కొన్ని కొత్త ఫీచర్‌లను అందిస్తామని ఆఫర్ చేస్తున్నాయని రీసెర్చ్ బృందం గుర్తించింది. అంటే.. యూజర్ల ఫోన్‌లలో స్టోర్ చేసిన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే స్కామ్ మాత్రమేనని రీసెర్చ్ టీం హెచ్చరిస్తోంది.  వాట్సాప్ మోడీఫైడ్ లేదా ఫేక్ వెర్షన్లను WhatsApp మాదిరిగానే ఫీచర్‌లను అందిస్తున్నాయి. అయితే మెసేజింగ్ యాప్ రియల్ వెర్షన్‌తో వచ్చే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ మాత్రం అందులో ఉండవని హెచ్చరిస్తోంది. ఇలాంటి యాప్స్ వాడటం ద్వారా మీ చాట్‌లు, వ్యక్తిగత డేటాను ప్రొటెక్ట్ చేయలేమని అంటోంది. అదే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ ఉంటే.. మీ వివరాలను ఎవరూ యాక్సెస్ చేయలేరని,  వాట్సాప్ కూడా చేయలేదని రీసెర్చ్ టీమ్ స్పష్టంచేసింది. వాట్సాప్ కొత్త ఫేక్ వెర్షన్ ప్లే స్టోర్‌లో ఉండవు. దాంతో చాలామంది యూజర్లు అనధికారిక వెబ్ సైట్ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయా యాప్స్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.  వాట్సాప్ అధికారిక వెర్షన్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా గూగుల్ ప్లై స్టోర్ వంటి విశ్వసనీయ యాప్ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తున్నారు వాట్సాప్ సీఈఓ. ఈ రకమైన యాప్‌లను గుర్తించి బ్లాక్ చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి యాప్స్ ద్వారా యూజర్లకు ఎలాంటి సమస్య లేకుండా ఉండేలా HeyModsపై చర్యలు తీసుకోనున్నామని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu