Ad Code

తిరుపతిలో ఎన్‌ఐఈఎల్‌ అండ్‌ ఐటీ


నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ అండ్‌ ఐటీ) త్వరలో తిరుపతిలో ఏర్పాటు కానున్నది. తిరుపతిలో ఈ జాతీయ సంస్థ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే పచ్చ జెండా ఊపింది. ఈ విషయాన్ని తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి మీడియాకు వెల్లడించారు. ఈ జాతీయ సంస్థ ప్రస్తుతం భారతదేశం అంతటా 47 కేంద్రాలను కలిగి ఉన్నది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో స్వయం ప్రతిపత్తిగా ఉన్నది. తిరుపతి నగరంలో ఎన్‌ఐఈఎల్‌ అండ్‌ ఐటీని ప్రారంభించడం ద్వారా విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ డిజైన్, టెక్నాలజీ, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్నత స్థాయి కోర్సులను పొందవచ్చని తిరుపతి ఎంపి డాక్టర్ ఎం గురుమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ సంస్థ ఏర్పాటుకు 8000-10000 చదరపు అడుగుల స్థలం కేటాయించాలని ఎన్‌ఐఈఎల్‌ అండ్‌ ఐటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మదన్‌ మోహన్‌ త్రిపాఠి.. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కాగా, తాత్కాలికంగా ఈ సంస్థను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏర్పాటుచేసేందుకు అనువైన భవనం కోసం వెతుకుతున్నారు. ఇన్ఫర్‌మేషన్‌, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగంలో మానవ వనరుల అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడం ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థలో 800 కు పైగా గుర్తింపు పొందిన శిక్షణ భాగస్వాముల నెట్‌వర్క్‌ ఉన్నది. కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్‌వేర్, సైబర్ లా, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ-వేస్ట్, ఇంటర్నెట్ రంగాలలో కోర్సులను అందించడంతో పాటు నాణ్యమైన విద్యను ఈ సంస్థ అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu