Ad Code

ఇన్‌స్టాలో కొత్త మ్యాప్ ఫీచర్ !


ఇన్‌స్టాగ్రామ్ కొత్త మ్యాప్స్ ఫీచర్‌ను యాడ్ చేసింది. యూజర్లు చాలా సులభంగా కొత్త లొకేషన్లను చూడొచ్చు. ఇప్పటి వరకు.. మీరు ఒక లొకేషన్ మాత్రమే సందర్శించే యూజర్ల పోస్ట్‌లను మాత్రమే చూశారు. కానీ, లొకేషన్ వివరాల గురించి తెలుసుకోలేరు. ఇన్‌స్టాలో రాబోయే లేటెస్ట్ అప్‌డేట్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్  యూజర్లు యాప్ ద్వారా రెస్టారెంట్లు, ఇతర ప్రసిద్ధ ప్రదేశాలను కనుగొనవచ్చు. ఇప్పుడు ఇన్‌స్టా IGలో కొత్త మ్యాప్‌ను కనుగొనవచ్చునని Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రకటించారు. మీరు ఇప్పుడు మీకు సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలను కనుగొనవచ్చు. అది కూడా కేటగిరీల వారీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలో ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుందని ఆయన తెలిపారు. యూజర్లు ఇప్పటికే పొందకపోతే కొన్ని రోజుల్లో అందుబాటులో రావొచ్చు. లేటెస్ట్ అప్‌డేట్ ఫీడ్ లేదా స్టోరీస్‌లో లొకేషన్ ట్యాగ్‌లను క్లిక్ చేయండి. తద్వారా ఏదైనా రెస్టారెంట్ లేదా స్థలం కోసం సెర్చ్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. నిర్దిష్ట హ్యాష్‌ట్యాగ్‌లతో ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్‌లో యూజర్లు కోరుకున్న ప్రదేశాలను సెర్చ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. వారి సెర్చ్ తగ్గించడానికి లొకేషన్ కేటగిరీలను ఫిల్టర్ చేస్తారు. మీరు ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్స్‌ కోసం.. మీ కంటెంట్‌లో లొకేషన్ ట్యాగ్‌లు లేదా స్టిక్కర్‌లను ఉపయోగించవచ్చు. ఆ పోస్టుల్లో మ్యాప్‌లో కనిపిస్తుంది. కానీ, మీ ప్రొఫైల్ పబ్లిక్ అయితే మాత్రమే మీ ఫీచర్ వర్క్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు లొకేషన్‌లను వెతికి సేవ్ చేయడానికి మ్యాప్స్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. తద్వారా భవిష్యత్తులో సందర్శించగలరు. డైరెక్ట్ మెసేజెస్ (DM) ద్వారా లొకేషన్‌లను స్నేహితులు, ఇతర గ్రూపులతో పంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu