అమెజాన్ నకిలీ గిఫ్ట్ కార్డ్‌ల ఫేక్ కాల్ సెంటర్‌ దాడి !
Your Responsive Ads code (Google Ads)

అమెజాన్ నకిలీ గిఫ్ట్ కార్డ్‌ల ఫేక్ కాల్ సెంటర్‌ దాడి !


గిఫ్ట్ కార్డ్‌లను రీడీమ్ చేస్తామనే సాకుతో ప్రజలను మోసగిస్తున్న నకిలీ కాల్ సెంటర్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఆదర్శ్, నవీన్, ప్రదీప్, ఎండీ సైఫుద్దీన్, నితిన్, ప్రవీణ్ చౌహాన్, రాహుల్, బ్రిజేష్, సాహిబా ఖాతున్ అలియాస్ ట్వింకిల్, అభా, మోనిక, మోహిత్ వర్మ పేరు గల వారు ఉన్నట్లు గుర్తించారు. ఇగ్నో రోడ్, నెబ్ సరాయ్‌లో అమెరికా పౌరులను మోసగించడానికి ఈ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో ఇగ్నో రోడ్‌లోని బల్హరా హాస్పిటల్ సమీపంలో ఉన్న కాల్ సెంటర్ మీద రైడ్ చేసి అందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని వక్తి ఇన్‌ఫార్మ ఇవ్వడంతో దాడి నిర్వహించబడింది అని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం కాల్ సెంటర్ లో కంప్యూటర్లు మరియు వాటి ఉపకరణాల సెటప్‌ను అమర్చినట్లు కనుగొనబడింది. చాలా మంది వ్యక్తులు ఫోన్ కాల్‌లను స్వీకరిస్తున్నారు. వీరు అమెజాన్ ప్రతినిధిగా నటిస్తూ బాధితులతో కమ్యూనికేట్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు అని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఫేక్ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్న నిందితుల వద్ద నుంచి తొమ్మిది డెస్క్‌టాప్ సిస్టమ్‌లతో పాటు ఇంటర్నెట్ రూటర్, టిపి-లింక్ మోడెమ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "కంప్యూటర్ యాప్స్- టీమ్ వ్యూయర్, జోహో అసిస్ట్‌ని ఉపయోగించడం ద్వారా కాల్ సెంటర్‌ నిర్వాహకులు బాధితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అమెజాన్‌లో రిడీమ్ చేసిన గిఫ్ట్ కార్డ్‌ల ద్వారా వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు అని పోలీసులు చెప్పారు. వీరి మీద పోలీసులు IPC సెక్షన్ 419/420/120B/34 కింద కేసులు నమోదు చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog