Ad Code

ఐ ఫోన్‌లో 'లాక్‌ డౌన్' మోడ్ ?


ఐ ఫోన్ యూజర్ల డేటాను అధునాతన స్పైవేర్ల నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు Apple iPhone, iPad, Apple Mac ప్రొడక్టుల్లో కొత్త ‘లాక్‌డౌన్ మోడ్’ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ప్రైవసీ-ఫోకసడ్ ఫీచర్ iOS 16, iPadOS 16, macOS Venturaలలో రిలీజ్ కానుంది. అలాగే, ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ మ్యాక్ బుక్‌కు లాక్‌డౌన్ మోడ్ యాడ్ చేయనున్నట్టు వెల్లడించింది. స్ట్రాంగ్ స్పైవేర్‌లు సైతం ఆపిల్ ప్రొడక్టుల నుంచి డేటాను తస్కరించకుండా ఉండేలా ఈ ప్రొటెక్టెడ్ లాక్ డౌన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐవోస్ 16, ఐప్యాడ్ ఓఎస్ 16, మ్యాక్ ఓఎస్ వెంచురా అప్ డేట్స్‌తో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందని ప్రకటించింది. డిజిటల్ రిస్క్ ఎదుర్కొనే కొద్దిమందికి లాక్‌డౌన్ మోడ్ అనేది ప్రొటెక్టడ్ ఫీచర్‌గా పనిచేస్తుందని తెలిపింది. ఆపిల్ లేటెస్ట్ ఫీచర్.. ప్రభుత్వ నిఘా స్పైవేర్‌ల నుంచి ప్రొటెక్ట్ కల్పించే లక్ష్యంతో రూపొందించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పెగాసస్, ఇతర ప్రభుత్వ ప్రాయోజిత స్పైవేర్ బారిన పడకుండా ఐఫోన్ యూజర్లు డేటాను లాక్‌డౌన్ మోడ్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ లాక్‌డౌన్ మోడ్‌ను బైపాస్ చేసి, మొబైల్ ఫోన్లలోకి చొరబడే మార్గాలను గుర్తించిన టెకీలకు Apple సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా రివార్డులను కూడా ఇస్తానని ప్రకటించింది. ఇందుకోసం టెక్కీలకు ఆహ్వానం పలికింది. మెర్సెనరీ స్పైవేర్ పరిశోధన వెర్షన్ విస్తరించేందుకు Apple $10 మిలియన్ల సైబర్‌ సెక్యూరిటీ గ్రాంట్‌పై వివరాలను అందించింది. ప్రైవసీ టూల్ ఇజ్రాయెల్-ఆధారిత NSO గ్రూప్, ఇతర రాష్ట్ర-ప్రాయోజిత మాల్వేర్ ద్వారా పెగాసస్ వంటి ప్రభుత్వ స్పైవేర్లను ఎదుర్కోవడానికి రూపొందించారు. ప్రధానంగా మెసేజ్‌లు, వెబ్ బ్రౌజింగ్, FaceTime, కాల్స్ వంటి Apple సర్వీసులకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తుంది. కంప్యూటర్ లేదా యాక్సెసరీతో వైర్డు కనెక్షన్‌లను కూడా బ్లాక్ చేస్తుంది. ఈ డివైజ్ మొబైల్ పరికర నిర్వహణ (MDM)లో నమోదు చేయలేరు. ఫిషింగ్, డేటా షేరింగ్, అకౌంట్లను హ్యాక్ చేయడం వంటి చర్యలను నిరోధించేందుకు Google 2017లో అధునాతన ప్రొటెక్షన్ ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ కూడా అదే విధమైన సురక్షిత బ్రౌజింగ్ అనుభవాన్ని అందించేందుకు ఎడ్జ్ బ్రౌజర్‌లో సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్‌పై వర్క్ చేయడం ప్రారంభించింది. Apple లేటెస్ట్ ప్రైవసీ-కేంద్రీకృత లాక్‌డౌన్ మోడ్ iPhone 7, iPhone 6S, మరిన్ని ఓల్డ్ జనరేషన్ Apple డివైజ్‌లను చేరుకోదని అర్థం. రెండో-జనరేషన్ iPhone SE సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో లాక్‌డౌన్ మోడ్ ఫీచర్ యాడ్ కానుంది.

Post a Comment

0 Comments

Close Menu