Ad Code

కృత్రిమ మేధస్సు ద్వారా జంతువులతో మాట్లాడొచ్ఛా ?


మనుషులు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకోడానికి భాష ఉన్నట్లే, జంతువులూ ఆయా శబ్ధాల ద్వారా సమాచారాన్ని అందిస్తుంటాయి. అయితే, వాటి స్వరాలపై మానవులు చూపుతున్న ఆసక్తి, చేస్తున్న అధ్యయనం చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే, ఇవి మాత్రమే వాటి భాష కాదు. చాలా మంది నిపుణులు దీనిని భాషగా సూచించరు కూడా. ఎందుకంటే, ఏ జంతువు కమ్యూనికేషన్ వాటి అన్ని అవసరాలను తీర్చవు. జంతువుల భాషను డీకోడ్ చేయడం ఈ మధ్య కాలం వరకు ఖచ్చితమైన పరిశీలనపై ఆధారపడి ఉంది. కానీ, ప్రస్తుతం, సమకాలీన జంతు సెన్సార్ల ద్వారా సేకరించే భారీ డేటాను నిర్వహించడానికి మెషిన్ లెర్నింగ్ టూల్‌ను ఉపయోగించడం పెరిగింది. కనుక, దీని ఆధారంగా భవిష్యత్తులో ఆయా జంతువులు సంప్రదింపుల కోసం వినియోగించే శబ్ధాలను నేర్చుకున్న మెషీన్లు వాటితో సంప్రదింపులు జరుపవచ్చు. ఇందులో భాగంగా, అజా రాస్కిన్ అనే పరిశోధకురాలు ఇతర జీవ జాతులతో మానవ బంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో మానవేతర కమ్యూనికేషన్‌ను అర్థంచేసుకునే లక్ష్యంతో యంత్ర అభ్యాసాన్ని ఉపయోగించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. అజా రాస్కిన్‌, ఎర్త్ స్పీసీస్ ప్రాజెక్ట్  సహ వ్యవస్థాపకురాలిగా, అధ్యక్షురాలిగా ఉన్నారు. ESP వ్యూహం ఇతర అధ్యయనాలకు భిన్నంగా ఉందని ఆమె పేర్కొంది. "మేము అభివృద్ధి చేసే సాధనాలు.. పురుగుల నుండి తిమింగలాల వరకు అన్నింటిపై జీవశాస్త్రంలో పని చేయగలవు" అని ది గార్డియన్‌కు నివేదించారు. జంతు సంభాషణను అర్థం చేసుకోవడానికి ప్రజలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారని జంతువులు, క్షీరదాల్లో స్వర సంభాషణను అధ్యయనం చేసే అసోసియేట్ ప్రొఫెసర్ ఎలోడివ్ బ్రీఫెర్ అన్నారు. పందులు సంతోషంగా లేదా విచారంగా ఉన్నప్పుడు చేసే శబ్ధాలను ఉపయోగించి వాటి భాషను గుర్తించడానికి బ్రీఫర్ పనిచేశారు. అలాగే, డీప్‌స్క్వీక్ అనే ప్రాజెక్ట్‌, ఎలుకలు ఒత్తిడిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాటి అల్ట్రాసోనిక్ శబ్దాలను విశ్లేషిస్తుంది. Cetacean Translation అనే మరొక ప్రాజెక్ట్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి స్పెర్మ్ వేల్ కమ్యూనికేషన్‌ను అనువదించే పనిలో ఉంది. ఇంకో ప్రాజెక్ట్, స్వయంచాలకంగా జంతువుల స్వరం క్రియాత్మక ప్రాముఖ్యతను అర్థంచేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుతం ప్రొఫెసర్ అరి ఫ్రైడ్‌లెండర్ ల్యాబ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu