Ad Code

రెడ్‌మీ ఏ1 ప్లస్ విడుదల !


దేశీయ మార్కెట్లో  రెడ్‌మీ ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.  ఇందులో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను అందించారు. మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా నిర్ణయించారు. బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్‌లో అక్టోబర్ 17వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 3 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఎక్కువ ఫీచర్లు ఇందులో ఆశించలేం. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10w ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 30 రోజుల వరకు స్టాండ్‌బై టైం, 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైంను ఇది అందించనుంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా రెడ్‌మీ ఏ1 ప్లస్‌లో అందించారు. 20 భారతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu