Ad Code

50 ఏండ్లు దాటితే నో జాబ్ !


అమెరికాలో 50 ఏండ్లు దాటిన భారతీయ మహిళలు ఇండ్ల వద్ద పిల్లలు ఉన్న మహిళలకు ఇన్ఫోసిస్ ఉద్యోగాలివ్వడానికి నిరాకరిస్తున్నది. దీనిపై ఇన్ఫీ మాజీ ఎగ్జిక్యూటివ్ అమెరికా కోర్టును ఆశ్రయించారు. సదరు ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌ను కొట్టేయాలన్న ఇన్ఫీ అభ్యర్థనను న్యూయార్క్ సౌత్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టి పారేసింది. 21రోజు ల్లో సమాధానం ఇవ్వాలని ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది. గత నెల 30న న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్ఫోసిస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. 50 ఏండ్లు దాటగంతోపాటు పిల్లల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న భారతీయ మహిళల పట్ల ఇన్ఫీ వివక్ష ప్రదర్శించిందంటూ సంస్థ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిల్ ప్రీజన్ ఆరోపణ చేశారు. ఇన్ఫీలో ఆమె రిక్రూటింగ్ అండ్ పార్టనర్స్ లెవెల్ వ్యవహారాల వైస్‌ప్రెసిడెంట్‌గా పని చేశారు. జిల్ ప్రీజన్ 2018లో తన 59వ ఏట 100 కోట్ల డాలర్ల వేతన ప్యాకేజీ కింద ఏడాది పాటు కన్సల్టింగ్ డివిజన్‌లో నియమితులు అయ్యారు. ప్రతిభావంతులను ఎంపిక చేసి.. సంస్థలోకి తీసుకురావడం ఆమె విధుల్లో ఒకటి. తాను ఉద్యోగిగా నియమితురాలైన రెండు నెలల్లోనే ఈ సంస్కృతిని మార్చడానికి ప్రయత్నించానని జిల్ ప్రీజన్ చెప్పారు. కానీ ఆమె అభ్యంతరాలకు ఇన్ఫోసిస్ పార్టనర్స్ జెర్రీ కుర్ట్జ్‌, డాన్ ఆల్‌బ్రైట్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 50 ఏండ్లు దాటడంతోపాటు ఇండ్ల వద్ద పిల్లలు ఉన్న భారతీయ మహిళల నియామకం పట్ల వివక్ష ప్రదర్శించరాదంటూ ఇన్ఫీ టాలెంట్ అక్విజిషన్ వైస్‌ప్రెసిడెంట్‌కు సూచించారు. భారతీయ మహిళల నియామకం పట్ల లింగ వివక్ష ప్రదర్శించడం న్యూయార్క్ సిటీ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని వాదించారు. ఆమె వాదనను తిరస్కరించిన ఇన్ఫీ యాజమాన్యం జిల్ ప్రీజన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె గతేడాది సెప్టెంబర్‌లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జిల్ ప్రీజన్ అభియోగాలకు ఆధారాలు లేకపోవడంతోపాటు ఇతర అంశాల ఆధారంగా ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చాలని ఇన్ఫీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. జిల్ ప్రీజన్ పిటిషన్‌పై 21 రోజుల్లో రిప్లయ్ ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 30న న్యూయార్క్ సౌత్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించడానికి ఇన్ఫోసిస్ అందుబాటులోకి రాలేదు. తర్వాత కూడా 50 ఏండ్లు దాటడంతోపాటు ఇండ్లలో పిల్లలు ఉన్న భారతీయ మహిళల నియామకం చేపట్టాలని ఇన్ఫోసిస్ పార్టనర్స్‌, ఎగ్జిక్యూటివ్‌లతో వాదించినట్లు జిల్ ప్రీజన్ చెప్పారు. ఇండ్ల వద్ద పిల్లల్లేని మహిళలు, 50 ఏండ్ల లోపు వారి నియామకానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కన్సల్టింగ్ డివిజన్ సీఈవో మార్క్ లివింగ్‌స్టన్ ముందు కూడా పిటిషన్ ఫైల్ చేసినట్లు చెప్పారు. తాను చట్టానికి లోబడి పని చేయాలని డిమాండ్ చేస్తూ లివింగ్‌స్టన్ ముందు పిటిసన్ దాఖలు చేయగానే తనను ఇన్ఫోసిస్ తొలగించేసిందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu