Ad Code

అమెజాన్ లో గిఫ్ట్‌ హ్యాంపర్ల జోరు !


దీపావళి సమీపిస్తున్న వేళ గిఫ్ట్ హాంపర్స్‌, స్వీట్లు, సంప్రదాయ దుస్తులు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ-కామర్స్ కంపెనీలు దీపావళి పండుగ సందర్భంగా అట్రాక్టివ్ గిఫ్ట్ హ్యాంపర్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్, డీల్స్ ప్రకటించాయి. అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన హ్యాంపర్‌లను తక్కువ ధరలకే తీసుకొచ్చింది. ప్రియమైనవారికి, పిల్లలు, వృద్ధులకు క్యాడ్‌బరీ సెలబ్రేషన్స్ - రిచ్ డ్రై ఫ్రూట్ కలెక్షన్‌ హ్యాంపర్‌ని బహుమతిగా అందించి ప్రేమను తెలియజేయవచ్చు. ఈ హ్యాంపర్‌ రూ.375 డిస్కౌంట్ ధరతో లభిస్తుంది. చాయ్‌ని ఇష్టపడే వారికోసం VAHDAM లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్ ప్యాక్‌ని కొనుగోలు చేయవచ్చు. బెర్రీ సినమాన్, ప్యూర్ మింట్, టర్మరిక్ అశ్వగంధ, చమోమిలే లావెండర్ గ్రీన్ టీ, హనీ లెమన్ గ్రీన్ టీ, వేద కధ హెర్బల్ టీ వంటి 6 ఆర్గానిక్ టీ ఫ్లావర్స్‌తో ఈ గిఫ్ట్ ప్యాక్ వస్తుంది. దీని అసలు ధర రూ.699 కాగా అమెజాన్‌లో రూ.399కి అందుబాటులో ఉంది. ఆత్మీయుల నోటికి అద్భుతమైన రుచులను పరిచయం చేయాలని భావిస్తున్నారా? అయితే పిజ్జా స్టిక్‌లు, నాచోస్, థిన్స్, మఖానా, మత్రి, కచోరీ, కుకీలు, కాఫీ, మరెన్నో పదార్ధాలతో వచ్చే స్నాకిబుల్ హెల్తీ దీపావళి స్నాక్ బాక్స్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ హ్యాంపర్‌ని రూ.599 డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. చాలా మంది మిఠాయిలను దీపావళికి బహుమతిగా ఇస్తారు. ఈ సారి ప్రత్యేకంగా GO DESi ప్రీమియం దీపావళి గిఫ్ట్ బాక్స్‌ను ట్రై చేయవచ్చు. ఇందులో క్యాండీలు, లాలీపాప్‌లు, బార్‌లు, బర్ఫీలు ఉంటాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ గిఫ్ట్ బాక్స్ ప్రైస్ రూ.799గా ఉంది. ప్రియమైన వారు కాఫీ ప్రియులైతే వారికి ఈ దీపావళి నాడు రేజ్ కాఫీ గిఫ్ట్ బాక్స్ అందించవచ్చు. ఇందులో బటర్‌స్కాచ్, హాజెల్‌నట్, క్యారమెల్, డార్క్ చాక్లెట్ అనే నాలుగు అద్భుతమైన కాఫీ రుచులు అందించే బీన్స్ ఉంటాయి. దీని అసలు ధర రూ.1,699 కాగా, అమెజాన్‌లో కేవలం రూ.999కే లభిస్తోంది. డ్రై ఫ్రూట్స్‌తో వచ్చే పేపర్ బోట్ బాదం గిఫ్ట్ ప్యాక్‌లో కరకరలాడే, స్మోక్డ్ నట్స్ ఉంటాయి. ఈ దీపావళికి దీనిని రూ.1,020కే కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఓపెన్ సీక్రెట్ దీపావళి హ్యాంపర్‌లో టేస్టీ & హెల్దీ స్నాక్స్, ప్రీమియం డ్రై ఫ్రూట్‌లు, కుకీలు ఉంటాయి. ఈ హ్యాంపర్‌ ఒరిజినల్ ప్రైస్ రూ.8,145 కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.4,999కి కొనుగోలు చేయవచ్చు. దీనిని గిఫ్ట్‌గా ఆత్మీయులకు ఇస్తే కచ్చితంగా ఇష్టపడతారనడంలో అతిశయోక్తి లేదు.

Post a Comment

0 Comments

Close Menu