Ad Code

మార్కెట్లోకి 'ఆస్టన్ మార్టిన్' లగ్జరీ కారు


బ్రిటీష్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'ఆస్టన్ మార్టిన్' భారతదేశంలో ఒక కొత్త లగ్జరీ కారుని విడుదల చేసింది.  ఈ కొత్త కారు పేరు 'డిబిఎక్స్ 707' (DBX 707). ఈ SUV ధర రూ. 4.63 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ప్రస్తుతం కంపెనీ విభాగంలో అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. ఇప్పటికే కంపెనీ స్టాండర్డ్ DBX మోడల్ ని 2021 లోనే లాంచ్ చేసింది. అప్పుడు ఆ కారు ధర రూ. 4.15 కోట్లు. అంటే ఇప్పుడు విడుదలైన DBX 707 కంటే 48 లక్షలు తక్కువ. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆస్టన్ మార్టిన్ DBX 707 ఎస్‌యువి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికోసం కంపెనీ ఇందులో అద్భుతమైన డిజైన్ ఎలిమెంట్స్ అందించింది. కావున స్టాండర్డ్ DBX తో పోల్చితే కొత్త SUV బుల్-వేన్ మెష్ ప్యాటర్న్‌తో పెద్ద గ్రిల్‌ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో స్టాండర్డ్ 22 ఇంచెస్ లేదా ఆప్సనల్ 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటుంది. రూప్ స్పాయిలర్ కూడా మరింత అట్రాక్టివ్ గా ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, లోపలి భాగం ఎక్కువగా స్పోర్టీ డిజైన్ థీమ్ కలిగి, స్పోర్ట్స్ సీట్లు ఉన్నాయి. ఇందులోని స్విచ్ గేర్ డార్క్ క్రోమ్‌లో పూర్తయింది. సెంటర్ కన్సోల్‌లోని డ్రైవ్ మోడ్‌ల కోసం కొత్త షార్ట్‌కట్ బటన్‌లు ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. అదే సమయంలో ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే లభిస్తుంది. ఆస్టన్ మార్టిన్ DBX 707 పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 5,039 మిమీ పొడవు, 1,998 మిమీ వెడల్పు, 1,680 మిమీ ఎత్తు, 3,060 మిమీ వీల్‌బేస్ మరియు 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. అయితే ఆఫ్ రోడ్ మోడ్ లో గ్రౌండ్ క్లియరెన్స్ లెవెల్స్ 235 మిమీ వరకు ఉంటాయి. ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, ఇందులో 4.0 లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ ఉంటుంది. ఇది 707 హెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 310 కిలోమీటర్ల వరకు ఉంటుంది.  రీట్యూన్డ్ ఎయిర్ సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్, లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ మరియు కొత్త కార్బన్-సిరామిక్ బ్రేక్ డిస్క్‌లను కలిగి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది, అంతే కాకుండా వాహనం వినియోగదారుడు మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu