వాట్సాప్ ప్రైవసీ ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా కనిపించే ఆప్షన్‌ను హైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాట్సప్‌లో కీలకమైన అప్‌డేట్ అని చెప్పాలి. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎవరికి తెలియకుండా ప్రైవసీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సిగ్నల్ యాప్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాట్సాప్‌లోనూ అందుబాటులోకి వంచ్చింది. సిగ్నల్‌లో స్క్రీన్ షాట్ బ్లాకింగ్, హిడెన్ కీబోర్డ్ వంటి ఇతర ప్రైవసీ ఫీచర్లు కూడా ఉన్నాయి. వాట్సాప్‌లో అలాంటి ఫీచర్స్ లేవు. ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారుల సౌలభ్యం కోసం, వారి గోప్యత కోసం ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.ఈ ఫీచర్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియకుండా హైడ్ చేయొచ్చు. ఇందుకోసం సెట్టింగ్‌కు వెళ్లి ఫీచర్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అవతలి వారికి తెలియొద్దని ఆ ఫీచర్‌ను ఆన్ చేస్తే అవతలి వారు కూడా ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మీకు తెలియదు. లాస్ట్ సీన్ ఫీచర్ ఎలా పని చేస్తుందో.. ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ తాజా అప్‌డేట్స్ తో అందుబాటులోకి వచ్చింది. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా అనే ఆఫ్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్.. ఇకపోతే వాట్సాప్ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు ఈ ఫీచర్‌ను వినియోగించొచ్చు. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను అవతలి వ్యక్తులకు కనిపించకుండా హైడ్ చేయొచ్చు. ముందుగా వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయాలి. కుడి వైపున పైన మూలలో మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. అందులో సెట్టింగ్ ఆప్షన్స్‌పై క్లిక్ చేసి, ఆ తరువాత అకౌంట్స్‌కి వెళ్లి.. ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 'ఆన్‌లైన్' అని ఉన్న చోట Every One, Same as Last Seen అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరూ చూడొద్దు అనుకుంటే Same as Last Seen అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి..ఈ ఆఫ్షన్ ద్వారా మీ స్టేటస్ ను హైడ్ చేయొచ్చు.
0 Comments