Ad Code

డిసెంబర్ 1 నుంచి హీరో టూ వీలర్స్ ధరల పెంపు !


హీరో మోటొకార్ప్ బైక్, స్కూటర్ ధరలను పెంచినట్లు వెల్లడించింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ తెలియజేసింది. హీరో మోటొకార్ప్ టూవీలర్ ధరలను రూ. 1500 వరకు పెంచింది. ఈ ధరల పెంపు వెహికల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతుంది. అంటే ఒక్కో బైక్ రేటు ఒక్కోలా పెరిగే ఛాన్స్ ఉంది. హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, ప్యాషన్ ప్రో, ఎక్స్‌పల్స్ 200, మ్యాస్ట్రో, ప్లీజర్, డెస్టినీ సహా దేశంలోని మోస్ట్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ బైక్ స్ల్పెండర్ ధర కూడా పైకి చేరింది. మీరు హీరో బైక్ లేదా హీరో స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇంకో మూడు రోజులే మిగిలున్నాయని గుర్తించుకోవాలి. తర్వాతి నుంచి ధరలు పైకి చేరనున్నాయి. హీరో మోటొకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. బైక్స్, స్కూటర్లపై దరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వాహన విడిభాగాల రేట్లు కూడా పైకి చేరాయని పేర్కొన్నారు. దీని వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని తెలిపారు. దీంతో డిసెంబర్ 1 నుంచి వాహన ధరలు రూ. 1500 వరకు పైకి చేరనున్నాయి. హీరో స్ల్పెండర్ నెంబర్ 1 మోటార్ సైకిల్‌గా కొనసాగుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో ఈ బైక్ అమ్మకాలు ఏకంగా 2,61,721 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ మోటార్‌సైకిల్ అమ్మకాలను గమనిస్తే.. ఈ బైక్ వాటానే 32.41 శాతంగా ఉంది. రెండో స్థానంలో హోండా సీబీ షైన్ కొనసాగుతోంది. దీని అమ్మకాలు 1,30,916 యూనిట్లుగా ఉన్నాయి.  కంపెనీ వాహన ధరలు పెంచడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం. చివరిగా కంపెనీ సెప్టెంబర్ నెలలో టూవీలర్ ధరలను రూ. 1000 మేర పైకి పెంచేసింది. ఇకపోతే కంపెనీ ఇటీవలనే తొలి ఎలక్ట్రిక్ వెహికల్ విదా వీ1 లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో వంటి మోడళ్లకు ఈ స్కూటర్ పోటీగా మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్కూటర్ రేంజ్ 163 కిలోమీటర్లు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.45 లక్షలు. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.

Post a Comment

0 Comments

Close Menu