Ad Code

ఆధార్ కార్డు ఉంటే చాలు !


ఆధార్ కార్డు కలిగిన వారు ఈజీగా యూపీఐ సర్వీసులు పొందొచ్చు. ఫోన్‌పే యాప్ వాడే ఆధార్ బేస్డ్ ఓటీపీ అథంటికేషన్ ద్వారా యూపీఐ సర్వీసులు యాక్టివేట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం లేదు. ఫోన్ పే యాప్ కలిగిన వారు ఆధార్ కార్డు వివరాల ద్వారా ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇదివరకు కస్టమర్లు డెబిట్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి వచ్చేది. అలాగే యూపీఐ పిన్ సెట్ చేసుకునేటప్పుడు డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సి వచ్చేది. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడే వారు. డెబిట్ కార్డు లేని వారు ఫోన్ పే సర్వీసులు పొందలేక పోయే వారు. ఇకపై ఈ సమస్య ఉండదు. ఆధార్ బేస్డ్ యూపీఐ ఆన్‌బోర్డింగ్ సర్వీసులు తీసుకువచ్చిన తొలి యూపీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా ఫోన్ పే నిలిచింది. కొత్త సర్వీసులు తీసుకురావడం వల్ల చాలా మంది ఇంకా ఫోన్ పే సేవలు పొందటం వీలవుతుంది. ఫోన్‌పే యూజర్లు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆధార్ కార్డులోని చివరి ఆరు నెంబర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్లకు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఫోన్ పే సర్వీసులు పొందొచ్చు. అంటే డెబిట్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు ఉపయోగిస్తే సరిపోతుంది. ఆధార్ బేస్ట్ అథంటికేషన్ సర్వీసులు అందిస్తున్న తొలి ఫిన్‌టెక్ సంస్థ తమదే అని అన్నారు. యూపీఐ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఇప్పుడు మరింత సులభతం అయ్యిందని తెలిపారు. ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ, యూఐడీఏఐ తీసుకువచ్చిన ఈ సర్వీసులు చాలా ఉపయోగకరమైనవని ఫోన్‌పే హెడ్ ఆఫ్ పేమెంట్స్ దీప్ అగర్వాల్ వివరించారు. డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు ఇది మంది ఉదాహరణ అని తెలిపారు. యూపీఐ అనేది గ్లోబల్ సక్సెస్ అని అభిప్రాయపడ్డారు. యూపీఐని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఎన్‌పీసీఐతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu