Ad Code

వాట్సాప్‌లో పోల్స్ పెట్డడం ఎలా ?


గ్రూప్ చాటింగ్ కోసం వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను వాట్సాప్ ఇటీవలే తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. 'కమ్యూనిటీస్'తో పాటు పోల్స్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ రూపొందించింది. దీంతో పాటు వాట్సాప్ 32 మంది వ్యక్తులకు వన్-ట్యాప్ వీడియో కాలింగ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అలాగే గ్రూప్స్‌లో సభ్యుల లిమిట్‌ను రెట్టింపు చేసింది. యాప్‌లోని ఇతర ఫీచర్‌ల మాదిరిగానే WhatsApp పోల్స్‌కు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. అంటే గ్రూప్‌ల్లో షేర్ అయిన పోల్‌ కంటెంట్‌ను చూడటం వాట్సాప్‌కు కూడా కుదరదన్న మాట. ఫేస్‌బుక్ మెసెంజర్, టెలిగ్రామ్‌ల్లో ప్రస్తుతం గ్రూప్ పోల్ ఫీచర్లు ఉన్నాయి. WhatsApp తాజా వెర్షన్‌లోని వినియోగదారులు ఏదైనా చాట్‌ని తెరవడం ద్వారా పోల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు ఐఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే చాట్ బాక్స్ పక్కన ఉన్న + గుర్తును నొక్కి, పోల్‌పై క్లిక్ చేయండి. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారులు చాట్ బాక్స్‌కు సమీపంలో ఉన్న పేపర్‌క్లిప్ చిహ్నంపై నొక్కి, ఆపై పోల్‌పై క్లిక్ చేయాలి. ఈ పోల్‌లు వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌ల్లో కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత మీరు ప్రశ్న లేదా టాపిక్‌ని టైప్ చేసి, ఇతరులు ఎంచుకోవడానికి ఆప్షన్స్‌ను అందించవచ్చు. ఆప్షన్‌ను ఎంచుకునేటప్పుడు మీరు ఒకదాన్ని ఎంచుకున్నాక కూడా దాన్ని కూడా మరో ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యతలను ఎంచుకునే ఆప్షన్ కూడా పోల్స్‌లో అందించనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu