జియో రీఛార్జ్ తో ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ !
Your Responsive Ads code (Google Ads)

జియో రీఛార్జ్ తో ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ !


జియో ఇంతకు ముందు చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ అందించేది. అయితే, రీసెంట్ గా ఆ ప్లాన్ లలో కొన్నింటిని పూర్తిగా తొలగించగా, మరి కొన్నింటిని రివైజ్ చేసింది. రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ తో మాత్రం ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ఇప్పటికీ అఫర్ చేస్తోంది. 

జియో Rs.1,499 ప్లాన్ ని  బెస్ట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటాని కూడా మీకు అందిస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఇప్పటి వరకు పైన చెప్పిన ప్రయోజనాలన్నిఒక ఎత్తయితే మరొక అదనపు ప్రయోజనం మిమల్ని మరింత ఆకట్టుకుంటుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం మీరు పొందుతారు. అంటే, మీకు 85 రోజుల జియో రీఛార్జ్ ప్రయోజనాలన్నీ కూడా ఉచితంగా అఫర్ చేస్తున్నట్లే. అయితే, Disney+ Hotstar Premium సబ్ స్క్రిప్షన్ ముందు నుండే కలిగి ఉన్న వారికి ఇది నచ్చదు.

జియో Rs.4,19 ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog