Ad Code

వాట్సాప్ లో వ్యూ వన్స్ ఫీచర్ !


వాట్సాప్ ‘వ్యూ వన్స్’ ఫీచర్ ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరికైనా మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే అది చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సదరు మెసేజ్ కనిపించకుండా పోతుంది. మెసేజ్ పంపిన వారికి, రిసీవ్ చేసుకున్నవారికి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. తమ వాట్సాప్ చాట్ ను ఎవరూ చూడకూడదు అనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫొటో లేదా వీడియోను ఒకసారి చూడగానే డిలీట్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. అంటే మీరు ఎదుటి వారికి పంపించిన ఫొటో లేదా వీడియోను అవతలి వ్యక్తి ఒకసారి మాత్రమే చూడగలరు. రెండోసారి చూడలేరు. అలాగే మరొకరికి ఫార్వర్డ్‌ చేయలేరు. చివరికీ స్క్రీన్‌షాట్‌ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను వాట్సాప్, టెక్ట్స్‌ మెసేజ్‌లకు కూడా వర్తింపజేయాలని యోచిస్తోంది. ఈ ఫీచర్‌ సహాయంతో మీరు ఎవరికైనా పంపించిన మెసేజ్‌ను కేవలం ఒకసారి చూసేలా చేయొచ్చు. రిసీవర్‌ మీ మెసేజ్‌ను చూసిన వెంటనే డిసప్పియర్‌ అవుతుంది. అవతలి వ్యక్తి చాట్‌ బాక్స్‌లో మెసేజ్‌ ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంది. దీంతో మీరు పంపిన మెసేజ్‌ను ఇంకెవరికీ ఫార్వర్డ్‌ చేయలేరు. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెండ్‌ బటన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొంతమంది ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ ఉపయోగిస్తున్న వారికి అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu