Header Ads Widget

సెల్ఫీలు - రకాలు !


సెల్ఫీ మోజు స్మార్ట్ ఫోన్ యువతలో రోజురోజుకు ముదురుతోంది. ఫలితంగా కొన్నిసార్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్స్, స్టేషన్ల వద్ద సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయి. సెల్ఫీలలో చాలా రకాలు ఉన్నాయి. హెల్తీ సెల్ఫీ, వ్యాలిడేషన్‌ సెల్ఫీ, స్నాప్‌ హ్యాపీ సెల్ఫీ, యాంఫిటైజర్‌ సెల్ఫీ, విక్టరీ సెల్ఫీ అంటూ చాలా సెల్ఫీలు ఉన్నాయి. 

హెల్తీ సెల్ఫీ: వినేందుకే కాస్త వెరైటీగా ఉన్నా ఈ సెల్ఫీ చాలా స్పెషల్‌ అనే చెప్పాలి. ఎందుకంటే సెల్ఫీలు కావాలంటే మనం కేవలం బయటకు వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే మన ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీలో కలిసి తీసుకుంటాం. అందుకు భిన్నంగా ఉండే సెల్ఫీనే ఈ హెల్తీ సెల్ఫీ. ఇది కేవలం మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నామన్న విషయంను తెలిపేందుకే ఈ హెల్తీ సెల్ఫీలను దిగుతుంటాం. ఉదాహరణకు జిమ్‌లో తీసుకునే సెల్ఫీలు కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే సెల్ఫీనే హెల్తీ సెల్ఫీ అంటారు. అంతేకాదు.. ఈ సెల్ఫీ తీసుకునే వ్యక్తి తన భిన్నమైన మానసిక స్థితిని చూపించడానికి ప్రయత్నించడం అని చెప్పొచ్చు. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటారు.

యాంఫిటైజర్ సెల్ఫీ: ఆసుపత్రిలో లేదా ఇబ్బందులు పడుతూ తీసుకునే సెల్ఫీలు అనే చెప్పాలి. జబ్బుపడినా, మందు తాగినా, ఇబ్బంది పడినా సెల్ఫీ తీసుకుంటే దాన్ని యాంఫిటైజర్ సెల్ఫీ అంటారు. వాస్తవానికి, ఈ సెల్ఫీని చూసిన తర్వాత, ప్రజలు మిమ్మల్ని ఓదార్చుతుంటారు.

విక్టరీ సెల్ఫీ: పేరులోనే విక్టరీ ఉంది కాబట్టి.. ఈ రకమైన సెల్ఫీలు ఏదైన గేమ్‌ లేదా ఏదైన సాధించిన సమయంలో మాత్రమే ఈ సెల్ఫీలుర తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించి, కీలకమైన పాయింట్‌కి చేరుకుంటే, జాబ్ రావడం, ఉద్యోగంలో ప్రమోషన్, నేతలు ఎన్నికల్లో నెగ్గడం లాంటి ఎన్నో సందర్భాలలో విక్టరీ గుర్తుతో తీసుకునే సెల్ఫీని విక్టరీ సెల్ఫీ అంటారు.

డక్‌ఫేస్ సెల్ఫీ: ఒక రకమైన ఫేస్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ పెట్టడం లేదా బాతు, లేదా పిచ్చుక వంటి పక్షిలా ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టడమే డక్‌ఫేస్‌ సెల్ఫీ. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వెరైటీ సెల్ఫీలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

స్నాప్ హ్యాపీ సెల్ఫీ: సెల్ఫీ తీసుకునే వ్యక్తి తన భిన్నమైన మానసిక స్థితిని చూపించడానికి ప్రయత్నించే సెల్ఫీ. ప్రజలు ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటారు.

వ్యాలిడేషన్‌ సెల్ఫీ: కొత్త హెయిర్ కట్ చేసుకునే ముందు ఆ తర్వాత తీసుకునే సెల్ఫీనే వ్యాలిడేషన్‌ సెల్ఫీ అంటారు. ఇది కాకుండా, అద్దంలో మీ కొత్త లుక్‌తో మీరు తీసుకునే సెల్ఫీని వాలిడేషన్ సెల్ఫీ అంటారు. 

Post a Comment

0 Comments