Ad Code

షార్ట్ సర్క్యూట్ ఎలా అవుతుంది ?


ఇంట్లో వాడే డివైజ్‌ల్లో ఆపరేటింగ్ కరెంట్ అనుకున్న యాంపియర్ల కంటే ఎక్కువ మించితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. అందు చాలా విద్యుత్ ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు. షార్ట్ సర్క్యూట్ వల్ల పెను ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే విద్యుత్ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు.  సాధారణంగా విద్యుత్‌ను యాంపియర్లలో కొలుస్తారన్నది తెలిసిన విషయమే. ఇక పలు డివైజ్‌లపై ఆపరేటింగ్ కరెంట్ అని రాసి ఉంటుంది. వాటిల్లో అనుకున్న డెసిమల్స్ కంటే ఎక్కువగా విద్యుత్ ప్రసారం అయితే అవి వేడెక్కిపోవడం లేదా కాలిపోవడం లాంటివి జరుగుతాయి. ఉదాహరణకు గీజర్ ఆపరేటింగ్ కరెంట్ 15 యాంపియర్లు కాగా దీనికి మించితే షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుంది. ఎలక్ట్రిక్ సాకెట్‌లో మల్టీప్లగ్ పెట్టి పలు విద్యుత్ ఉపకరణాలను వినియోగిస్తే కరెంట్ లోడ్ అనేది అధికం అవుతుంది. తద్వారా షార్ట్ సర్క్యూట్ ప్రమాదం రావచ్చు. అందుకే ఇంటిలోని గృహోపకరణాలను వివిధ స్విచ్‌ల ద్వారా అనుసంధానం చేసి వినియోగించడం మంచిది. 

Post a Comment

0 Comments

Close Menu