Ad Code

చైనా నుంచి ఎలక్ట్రిక్ ఫ్యాన్, స్మార్ట్ మీటర్లు ?


స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ ఫ్యాన్, స్మార్ట్ మీటర్లు క్షుణంగా తనిఖీ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ను త్వరలో జారీ చేయనుంది. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి అవుతున్న బొమ్మలపై కఠినమైన క్వాలిటీ తనిఖీలను నిర్వహించడం ద్వారా సక్సెస్‌పుల్‌గా వాటి దిగుమతులను నియంత్రించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సీలింగ్ ఫ్యాన్‌ల దిగుమతి 132 శాతం పెరిగి 6.22 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో చైనా వాటా 5.99 మిలియన్ డాలర్లుగా ఉంది. విద్యుత్ స్మార్ట్ మీటర్లు దిగుమతి విలువ 3.1 మిలియన్ల డాలర్లు కాగా, చైనా నుంచే 1.32 మిలియన్ల డాలర్ల వ్యాపారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఓ అధికారి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు, సీలింగ్ ఫ్యాన్‌ల వంటి భారీ ఉత్పత్తి వస్తువుల కోసం QCOలను తీసుకురావాలని చూస్తున్నామన్నారు. దీంతో మన దేశంలోని పరిశ్రమలకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి అవుతున్న అన్ని రకాల ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్‌ను ఎగ్జామిన్ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రొడక్ట్ మాన్యువల్స్, స్టాండరైజేషన్ ప్రాసెస్, టెస్టింగ్ లేబొరేటరీస్ వంటివి అందుబాటులో ఉన్న చోట QCOలను పరిచయం చేయడానికి భారీ కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu