Ad Code

టెస్లా మాన్యుఫాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం !


ఎలాన్ మస్క్ తన టెస్లా కార్లను భారత్ లో విక్రయిస్తామంటే కచ్చితంగా స్వాగతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అందుకు ఏ విధమైన అడ్డంకులు ఉండవని హామీ ఇచ్చారు. గత కొంత కాలంగా ఎలన్ మస్క్ టెస్లా కార్లను భారత్ లో విక్రయించాలని చూస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే అమెరికా, చైనా దేశాల్లో ఉత్పత్తి చేసిన కార్లని భారత్ లోకి దిగుమతి చేసి అమ్మాల్సి ఉంటుంది. దానివల్ల టాక్సులతో కలిపి కార్ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తున్న భారత ప్రభుత్వం, ఇక్కడ టెస్లా కార్లను విక్రయించాలంటే వాటి మాన్యూఫాక్చరింగ్ సెంటర్ ని భారత్ లోనే నెలకొల్పాలని షరతులు పెట్టారు. దీనికోసం మస్క్ కు అవసరమైన సహాయ సహకారాలు, రాయితీలన్నీ భారత ప్రభుత్వం ఇస్తుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దీనికి కారణం వివరిస్తూ భారత్ ప్రతీ ఏటా ఆటో మొబైల్ రంగంలో రూ.7.5 లక్షల కోట్ల బిజినెస్ జరుపుతుందని, టెస్లా రాకతో అది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీనివల్ల భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 4 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్న ఈ రంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ పన్నులు వసూలు  అవుతున్నాయన్నారు. అయితే, మస్క్ మాత్రం తొలుత విదేశాల్లో తయారైన కార్లను భారత్ లో విక్రయించి, తర్వాత యూనిట్లవారీగా తయారీ కేంద్రాలను నెలకొల్పుతామంటున్నాడు. 

Post a Comment

0 Comments

Close Menu