19 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ !


గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ఈ సేల్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ 4 రోజుల పాటు.. అంటే జనవరి 22 వరకు కొనసాగనుంది. ప్రైమ్ వినియోగదారులకు 24 గంటల ముందే అంటే జనవరి 18న ఈ సేల్ ప్రారంభం కానుంది. గతేడాది సెప్టెంబర్ 23న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించింది అమెజాన్ ఆ సేల్ లో ఎలక్ట్రానిక్స్.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇయర్ ఫోన్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది అమెజాన్. అయితే.. ఆ సేల్ చాలా రోజుల పాటు కొనసాగినా డిస్కౌంట్ ఆఫర్లు మాత్రం కొన్ని రోజులే ఉన్నాయి. దీంతో మళ్లీ అమెజాన్ నుంచి భారీ సేల్ ఎప్పుడు వస్తుందా? అంటూ వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో వినియోగదారుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 రోజుల ముందే సేల్ తేదీలను ప్రకటించడంతో షాపింగ్ చేయాల్సిన వస్తువుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ఈ సేల్ లో ఆఫర్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు అమెజాన్ . మరో రెండు రోజుల తర్వాత నుంచి ఆఫర్ల వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో  కొనుగోలు చేసే వారికి మాత్రం 10 శాతం అదనపు తగ్గింపు ఉంటుందని ప్రకటించింది ఈ కామర్స్ సంస్థ. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. వినియోగదారులు సేల్ చివరి తేదీ వరకు వేచి చూడకుండా సేల్ ప్రారంభమయ్యే తేదీరోజే తమకు కావాల్సిన వస్తువులను కొనేయడం బెటర్. ఎందుకంటే.. గత సేల్ లో మొదటి రెండు రోజులపై ఉన్న భారీ డిస్కౌంట్లు తర్వాత కనిపించలేదు. దీంతో అనేక మంది వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Post a Comment

0 Comments