Ad Code

ఓల్డ్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్స్‌కు కూడా లేటెస్ట్‌ ఫీచర్లు ?


సాధారణంగా ఓల్డ్‌ డివైజ్‌లకు చాలా కంపెనీలు లేటెస్ట్‌ అప్‌డేట్స్ అందించవు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీలు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల్లో మార్పులు తీసుకొస్తుంటాయి. లేటెస్ట్‌ టెక్నాలజీకి ఓల్డ్‌ డివైజ్‌లు సపోర్ట్ చేయనప్పుడు కంపెనీలు కొన్ని సేవలను నిలిపివేస్తాయి. బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందుకోవడానికి, సైబర్‌ ఎటాక్స్ వంటి సమస్యల నుంచి ప్రొటెక్షన్‌ పొందడానికి లేటెస్ట్‌ వెర్షన్స్‌కు అప్‌గ్రేడ్‌ కావాలని సూచిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొత్త డివైజ్‌లు కొనక తప్పదు. ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ ఓ గుడ్‌న్యూస్‌ అందించింది. ఓల్డ్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లకు కూడా లేటెస్ట్‌ అప్‌డేట్స్ అందించేలా గూగుల్‌ కంపెనీ కొత్త పరిష్కారాన్ని పరిచయం చేస్తోంది. దీనికి సంబంధించిన ఎక్స్‌టెన్షన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కిట్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే ఉన్న ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లకు నిర్దిష్ట ప్లాట్‌ఫారం ఫంక్షనాలిటీ ఎక్స్‌టెండ్‌ చేయడానికి సపోర్ట్‌ చేస్తుందని గూగుల్‌ ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. దీని ద్వారా డెవలపర్లు ఆండ్రాయిడ్‌ 11, ఆండ్రాయిడ్‌ 12 సహా పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లలో కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ల ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి లేటెస్ట్‌ అప్‌డేట్‌లు అందుకోని డివైజ్‌ల కోసం గూగుల్‌ ఈ చర్యలు తీసుకుంటోంది. గూగుల్‌ ఎక్స్‌టెన్షన్ SDK ద్వారా డెవలపర్లు పాత ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లపై కొత్త ఆండ్రాయిడ్‌ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చని ది వెర్జ్ రిపోర్ట్ పేర్కొంది. ఆండ్రాయిడ్‌లో ప్రైవసీ శాండ్‌బాక్స్ టెస్టింగ్‌ను ఎక్స్‌పాండ్‌ చేస్తుంది. ప్రైవసీ శాండ్‌బాక్స్ అనేది తన యాడ్-ట్రాకింగ్ సిస్టమ్‌కు గూగుల్‌ రీప్లేస్‌మెంట్‌. ఆండ్రాయిడ్ 13 కోసం బీటా అప్‌డేట్ అందించాలనే యోచనలో గూగుల్‌ ఉంది. మేజర్‌ OS అప్‌గ్రేడ్‌లను విడుదల చేయనవసరం లేకుండా.. గూగుల్ ఎక్స్‌టెన్షన్ SDK ద్వారా కంపెనీ పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లలో ప్రైవసీ శాండ్‌బాక్స్‌ను అప్‌డేట్ చేయగలదు. ఈ విధానం వేగవంతమైన ప్రొడక్ట్‌ డెప్లాయ్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తుందని గూగుల్‌ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ ఫండమెంటల్‌ కాంపొనెంట్స్‌ను Play Store ద్వారా అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డెవలపర్‌లకు గూగుల్‌ ఎక్స్‌టెన్షన్‌ SDK ద్వారా పాత వాటిపై ఇటీవలి ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు ఓల్డ్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యే ఉద్దేశం లేని వారు.. ఇప్పుడు అవసరమైన అప్‌డేట్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా నేరుగా యాక్సెస్ చేయగలరు. ది వెర్జ్ ప్రకారం మీడియా ప్లేబ్యాక్, Wi-Fi, పర్మిషన్స్‌ అండ్‌ ఆండ్రాయిడ్ రన్‌టైమ్ వంటి సిస్టమ్‌లను అప్‌డేట్‌ చేయడానికి ఈ సిస్టమ్‌ను గూగుల్‌ ఇప్పటికే అమలు చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu