Ad Code

గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ రిస్క్ ?


గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లోని ఒక సాంకేతిక లోపం పెద్ద రిస్క్‌లో పడినట్లు తాజాగా కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ పేర్కొంది. యూజర్ల పర్సనల్‌, సెన్సిటివ్ డీటెయిల్స్ హ్యాకర్లు దొంగిలించడానికి ఈ లోపం ఓకే మార్గంగా ఉపయోగపడుతుందని కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్, ఇతర క్రోమియం -ఆధారిత బ్రౌజర్లు వాడేవారికి దీనివల్ల ఎక్కువ రిస్క్ ఉంటుంది. యూజర్ల క్రిప్టోకరెన్సీ వాలెట్‌ల కంటెంట్లు, లాగిన్ క్రెడెన్షియల్స్ సహా వారి సున్నితమైన ఫైల్‌లను దొంగిలించడానికి ఈ సాంకేతిక లోపం హ్యాకర్లకు సహాయపడుతుంది. ఇంపెర్వాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు రీసెంట్‌గా సుమారు 2.5 బిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్న Chrome, Chromium-ఆధారిత బ్రౌజర్లు ఫైల్ సిస్టమ్‌లతో ఇంటరాక్ట్ అయ్యే విధానంలో సాంకేతిక లోపం ఏర్పడిందని కనుగొన్నారు. మరింత కచ్చితంగా చెప్పాలంటే బ్రౌజర్లు సిమ్‌లింక్‌లను ప్రాసెస్ చేసే విధానంలో సాంకేతిక లోపం ఉంది. సిమ్‌లింక్స్‌ లేదా సింబాలిక్ లింక్స్‌ అనేవి మరొక ఫైల్ లేదా డైరెక్టరీని సూచించే ఫైల్‌లు. లింక్డ్‌ ఫైల్ లేదా డైరెక్టరీని సిమ్‌లింక్ లొకేషన్‌లో ఉన్నట్లుగా హ్యాండిల్ చేయడానికి అవి OSని అనుమతిస్తాయి. ఈ సిమ్‌లింక్ ప్రాసెస్ షార్ట్‌కట్లను రూపొందించడానికి, ఫైల్ మార్గాలను దారి మళ్లించడానికి లేదా ఫైల్‌లను మరింత సౌకర్యవంతమైన రీతిలో ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు బ్లాగ్ పోస్ట్‌లో వివరించారు. సిమ్‌లింక్ లొకేషన్‌ను కచ్చితంగా సూచిస్తుందో లేదో Chrome సరిగ్గా చెక్ చేయడం లేదని.. అలాంటి సందర్భాలలో దాడులు పెరిగే అవకాశం ఉందని, గత కొన్ని రోజులుగా Chromiumలో ఇదే జరిగిందని సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ఇది దాడి చేసే వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి లేదా హానికరమైన చర్యలను చేయడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ రకమైన భద్రతా లోపాలను నివారించడానికి ఫైల్‌లను సరిగ్గా ధ్రువీకరించడం, నిర్వహించడం చాలా ముఖ్యమని అన్నారు. దాడి చేసే వ్యక్తులు ఈ లొసుగు గురించి తెలుసుకుంటే, వారు సింపుల్‌గా వెబ్‌సైట్‌ను సృష్టించి, ప్రైవసీ డీటెయిల్స్‌కు యాక్సెస్‌ను అందించే వారి రికవరీ కీలను డౌన్‌లోడ్ చేయమని యూజర్లను అడగవచ్చు. వారు ఇతర వివరాలను లేదా డబ్బును దొంగిలించడానికే ఆ వివరాలను అడుగుతున్నారనే విషయం యూజర్లు తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ మొదటగా దీని గురించి వివరించి ఆపై క్రోమ్ 108 వెర్షన్ ద్వారా ఒక ప్యాచ్‌ను సెండ్ చేసింది. కాగా మీ సిస్టమ్‌లో ఈ క్రోమ్ వెర్షన్ ఇన్‌స్టాల్ అయిందో లేదో నిర్ధారించుకోవడం ముఖ్యం.

Post a Comment

0 Comments

Close Menu