ఇండియాలో ట్రూక్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్, ఆడియో ఎక్విప్‌మెంట్, యాక్సెసరీస్ రిలీజ్ చేస్తూ మార్కెట్ షేర్ క్రమంగా పెంచుకుంటోంది. ఈ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ తాజాగా మన దేశంలో సరికొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది. 'ట్రూక్ బడ్స్ A1' పేరుతో లేటెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాలో వీటి ధర రూ.1499గా పేర్కొంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ప్రొడక్ట్‌ను రూ.1299కే సొంతం చేసుకోవచ్చు. ట్రూక్ బడ్స్ A1.. బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో, స్పెషల్ క్లాసిక్ కేస్ డిజైన్‌తో లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్‌కు ఒక సంవత్సరం వారంటీ ఉంది. కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా 250+ యాక్టివ్ సర్వీస్ సెంటర్లను కంపెనీ నెలకొల్పింది. ప్రీ ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే వీటి సేల్ మార్చి 3న ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ట్రూక్ బడ్స్ A1 రూ.1299కి అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ పీరియడ్ ముగిసిన తర్వాత ఇవి రూ.1499కి లభిస్తాయి. A1 హైబ్రిడ్-యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. దీంట్లోని 10mm రియల్ టైటానియం స్పీకర్ డ్రైవర్స్ మంచి సినిమాటిక్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. Quad-MIC ENCతో పాటు, 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC) కెపాసిటీ దీని సొంతం. బడ్స్ A1లో డైనమిక్ ఆడియో, బాస్ బూస్ట్ మోడ్, మూవీ మోడ్ వంటి మూడు EQ మోడ్స్ ఉన్నాయి. ఇవి స్మూత్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 48 గంటల ప్లేటైమ్ అందిస్తాయి. డివైజ్‌లోని 300mAh బ్యాటరీని USB-Cతో ఛార్జ్ చేయవచ్చు. ట్రూక్ బడ్స్ A1 బ్లూటూత్ 5.3తో బెస్ట్ కనెక్షన్ కంపాటబిలిటీని అందిస్తుంది. వన్ స్టెప్ ఇన్‌స్టంట్ పెయిరింగ్ టెక్నాలజీతో ఇయర్‌బడ్స్‌ను ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. గేమర్స్ కోసం 50ms వరకు అల్ట్రా-లో లేటెన్సీతో బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది.
రూ.1,299కే ట్రూక్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ !
0
February 25, 2023
Tags