2050 నాటికల్లా అన్ని ప్రొడక్ట్స్ 100% రీసైకిల్ ప్లాస్టిక్ ద్వారా తయారు !
Your Responsive Ads code (Google Ads)

2050 నాటికల్లా అన్ని ప్రొడక్ట్స్ 100% రీసైకిల్ ప్లాస్టిక్ ద్వారా తయారు !


శాంసంగ్ పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా మారేందుకు 2050 నాటికి శాంసంగ్ తన ప్రొడక్ట్స్ అన్నింటినీ రీసైకిల్ ప్లాస్టిక్ ద్వారా తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్ధాలను రీయూజ్ చేసేందుకు కొత్త టెక్నాలజీని సైతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించాలని, 2025 నాటికి ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌లను ఉపయోగించడాన్ని ఆపాలని యోచిస్తున్నట్లు తెలిపింది. పార్క్ సంగ్-సన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, శామ్‌సంగ్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ విభాగానికి చెందిన మెకానికల్ ఆర్&డీ టీమ్ హెడ్, సియోల్‌లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం విశేషం. ఇఫ్పటికే ఫిబ్రవరి ప్రారంభంలో Samsung Galaxy S23, Galaxy S23 Plus , లగ్జరీ మోడల్ Galaxy S23 Ultra అనే మూడు మోడళ్లలో కొత్త Galaxy S ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ ఫోన్లో సైతం రీసైకిల్ ప్లాస్టిక్ ను ఉపయోగించడం ప్రారంభించినట్లు తెలిపింది. శామ్సంగ్ గెలాక్సీ S23 రీసైకిల్ పదార్థాలతో తయారు చేసిన 12 ఇంటర్నల్ భాగాలను ఉపయోగించినట్లు తెలిపింది. Galaxy S23, Plus మోడల్‌లు 11 భాగాలను రీసైకిల్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసినట్లు తెలిపారు. Galaxy S23 అల్ట్రా వెనుక గ్లాస్, PET సీసాల నుండి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ ఉపయోగించినట్లు తెలిపారు. సైడ్ కీ, వాల్యూమ్ కీ, SIM ట్రేలో రీసైకిల్ చేసిన అల్యూమినియంను ఉపయోగించినట్లు తెలిపారు.టెక్ దిగ్గజం ప్రకారం, లగ్జరీ మోడల్‌లో సగటున 22 శాతం రీసైకిల్ కంటెంట్‌ను కలిగి ఉండే ముందు, వెనుక భాగంలో రీసైకిల్ గాజును కూడా ఉపయోగించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు కారణంగా మనుషులతో పాటు ఇతర జీవాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ప్లాస్టిక్ వ్యర్ధాల కారణంగా భవిష్యత్ తరాలు కాలుష్యం బారిన పడుతున్నాయి అందుకే ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడం ద్వారా కొంతమేరకైనా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చని సాంసంగ్. ఇందుకు సంబంధించిన టెక్నాలజీని సైతం డెవలప్ చేస్తున్నట్లు సాంసంగ్ తెలిపింది. ప్లాస్టిక్ తో పాటు అల్యూమినియం గాజు కాపర్ ఇతర లోహాలను కూడా రీసైకిల్ పద్ధతిన ఉపయోగించ ఉన్న సాంసంగ్ తెలపడం విశేషం. కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్‌లో రీసైకిల్ చేసిన ఓషన్-బౌండ్ ప్లాస్టిక్‌లను ఉపయోగించడం వల్ల 2023 నాటికి 15 టన్నుల కంటే ఎక్కువ ఫిషింగ్ నెట్‌లు మహాసముద్రాలను కలుషితం చేయకుండా నిరోధించినట్లు శామ్‌సంగ్ తెలిపింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog