Ad Code

అమల్లోకి వచ్చిన ట్విట్టర్ నిబంధన !


సోషల్ మీడియా అనగానే గుర్తు వచ్చే యాప్స్ ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్. ఈ మూడు యాప్స్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. అయితే ట్విట్టర్ యాప్ ఎక్కువగా సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకూ అందరూ వాడుతున్నారు. యూజర్లు ఇందులో తమ ఫాలోవర్లను ఎంతమందిని పెంచుకుంటే అంత గౌరవంగా ఫీలవుతారు. ముఖ్యంగా ట్విట్లర్‌లో వెరిఫైడ్ ఖాతాలకు ఉండే క్రేజే వేరు. అయితే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ సీఈఓ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వివిధ నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. భవిష్యత్‌తో వెరిఫైడ్ ఖాతాదారులు కావాలంటే సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలని సీఈఓగా ఉన్న ప్రారంభ రోజుల్లోనే చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ వెరిఫైడ్ ఖాతాదారుల నుంచి సబ్‌స్క్రిప్షన్ వసూలు చేసేలా ఏప్రిల్ 1 నుంచే కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో వెరిఫైడ్ బ్యాడ్జ్‌గా పిలిచే బ్లూ టిక్ తీసేశారు. ఇకపై సబ్‌స్క్రిప్షన్ కట్టిన వారికే వెరిఫైడ్ ఖాతా కింద గుర్తిస్తారు. ట్విట్టర్ కంపెనీ యూజర్‌బేస్, ఆదాయాన్ని పెంచడానికి కొత్త ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన కీలక అప్‌డేట్‌లలో ట్విట్టర్ బ్లూ లాంచ్ కూడా ఒకటిగా ఉంది. సబ్‌స్క్రిప్షన్‌లో లాంగ్-ఫార్మ్ ట్వీట్‌లు (280 అక్షరాలు దాటి), ట్వీట్‌లను అన్‌డు/ఎడిట్ చేయడం వంటి చాలా డిమాండ్ ఉన్న ఫీచర్‌లు ఉన్నాయి. ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ బ్లూ టిక్‌ను బండిల్ చేస్తుందని మస్క్ చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను అందించడంతో పాటు నెలవారీ రుసుమును చెల్లించడం ద్వారా ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో ధ్రువీకరించుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu