Ad Code

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పెరగనున్న జీతాలు !


2023 ఆర్థిక సంవత్సరం మాదిరిగానే 2024లో కూడా జీతాల పెంపు ఉంటుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు తెలిపింది. ఈటీ నౌ మీడియా రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనపర్చిన ఉద్యోగులకు 12-15 శాతం, ఇతరులకు 1.5-8 శాతం మధ్య జీతం పెంపు ఉండచ్చు. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపినట్లు సదరు మీడియా రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల త్రైమాసికానికి సంబంధించి 100 శాతం వేరియబుల్ పేమెంట్‌ను ఉద్యోగులు పొందనున్నారని ఈ విషయాన్ని లక్కడ్ ధృవీకరించినట్లు ఈటీ నౌ పేర్కొంది. 'ఈసారి జీతాల పెంపు అనేది ఇప్పటివరకు ఇచ్చిన మాదిరిగా ఉంటుంది. ముఖ్యంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు 12-15 శాతం జీతం పెంచాలనుకుంటున్నాం. ఇతర ఉద్యోగులకు 1.5 నుంచి 8 శాతం మధ్య జీతాల పెంపు ఉండవచ్చు.' అని లక్కడ్ పేర్కొన్నారని ఈటీ నౌ మీడియా తన రిపోర్ట్‌లో వెల్లడించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ Q4 ఫలితాలను గత బుధవారం ప్రకటించింది. 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభం 14.8 శాతం పెరిగి, రూ.11,436కోట్లకు, ఆదాయం 16.94 శాతం పెరిగి రూ.59,162 కోట్లకు చేరుకుంది. కాగా, గతేడాది ఇదే సమయంలో టీసీఎస్ ఆదాయం రూ.50,591 కోట్లు కాగా, నికర లాభం రూ.9,959 కోట్లుగా ఉంది. తాజా డేటా ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి TCS మొత్తం వర్క్‌ఫోర్స్ 6,14,795గా ఉంది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 150 దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 35.7 శాతం మహిళలు ఉన్నారు. టీసీఎస్ అట్రిషన్ రేటు స్వలంగా తగ్గింది. గత-పన్నెండు నెలల ప్రాతిపదికన ప్రస్తుతం 20.1 శాతం వద్ద ఉంది. డిసెంబర్ 2022తో ముగిసిన మునుపటి త్రైమాసికంలో అట్రిషన్ రేటు 21.3 శాతం కాగా, సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 21.5 శాతంగా ఉంది. దీంతో అట్రిషన్‌ను నియంత్రించడానికి కంపెనీ కొత్త సిబ్బందిని నియమించుకోవడానికి మొగ్గు చూపుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌తో పాటు ఎక్కువ సంఖ్యలో ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్స్‌ను ఆన్‌బోర్డ్‌లోకి తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం జనవరిలో దాదాపు 1.25 లక్షల నుంచి 1.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకోవాలని టీసీఎస్ యోచిస్తోంది. కాగా, గత అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 2,197 ఉద్యోగాలను తొలగించింది. కాగా, ఈ త్రైమాసికంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో సహా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో ప్రతికూల సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో చాలా కంపెనీలు Q4లో అంచనాల కంటే తక్కువ ఫలితాలను నమోదు చేశాయి. 

Post a Comment

0 Comments

Close Menu