Ad Code

దేశీయ మార్కెట్లోకి సింపుల్ వన్ ఈ-స్కూటర్‌ !


దేశీయ మార్కెట్లోకి 'సింపుల్ ఎనర్జీ' ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. దీని ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిజిటల్ డిస్‌ప్లేపై నేవీగేషన్‌, డాక్యుమెంట్ స్టోరేజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్‌, ఓటీఏ అప్ డేట్స్, బ్యాటరీ అండ్ రేంజ్ వివరాలు కనిపిస్తాయి. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 212 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. 5.54 గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. కేవలం 2.77 సెకన్లలో 40 కి.మీ.వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో నిమిషం పాటు చార్జింగ్ చేస్తే 1.5 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 8.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ స్కూటర్ పని చేస్తుంది. ఈ మోటార్ 72 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. యూజర్లకు అందుబాటులో ఉంది. బ్రెజెన్ బ్లాక్, నమ్మా రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, బ్రాజెన్ ఎక్స్, లైట్ ఎక్స్ రంగుల్లో లభిస్తుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి అవసరమైన పరికరాల్లో 95 శాతం దేశీయంగా సమకూర్చుకున్నామని సింపుల్ ఎనర్జీ ఫౌండర్‌, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ చెప్పారు. ఐపీ67 రేటింగ్‌తో కూడిన ఈ స్కూటర్‌ల్ 5 కిలోవాట్ల లిథియం అయాన్ డ్యుయల్ బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నట్లు తెలిపారు. అత్యంత స్మార్ట్‌గా ఉండే ఈ స్కూటర్ సుదీర్ఘ దూరం ప్రయాణించగలుగుతుందని, డ్యుయల్ బ్యాటరీ దీని ప్రత్యేకత అని చెప్పారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.45 లక్షల నుంచి మొదలవుతుంది. 750 వాట్ల పోర్టబుల్ చార్జర్ కోసం అదనంగా రూ.13 వేలు పే చేయాలి. వచ్చేనెల ఆరో తేదీ నుంచి స్కూటర్ల డెలివరీ ప్రారంభిస్తారు. తొలుత బెంగళూరు నుంచి ప్రారంభించి దశల వారీగా మిగతా నగరాల్లో డెలివరీలు చేస్తారు. ఇప్పటికే గత 18 నెలల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం లక్షకు పైగా ప్రీ-బుకింగ్స్ నమోదయ్యాయి. సింపుల్ ఎనర్జీ 'సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్' భారత్ మార్కెట్లో ఎథేర్ 450, ఓలా ఎస్1, టీవీఎస్ ఐ-క్యూబ్ వంటి స్కూటర్లతో తల పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులోని షూలాగిరిలో సింపుల్ విజన్ 1.0 అనే పేరుతో నూతన మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది సింపుల్ ఎనర్జీ. ఇది ఏటా దాదాపు ఐదు లక్షల స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu