Ad Code

పేటీఎమ్ లో సరికొత్త ఫీచర్లు !


ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం తాజాగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.  యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన iOSలో యూపీఐ లైట్ ఫీచర్, యూపీఐకి రూపే క్రెడిట్ కార్డ్ యాడింగ్, స్ల్పిట్, మొబైల్ నంబర్స్ కు బదులుగా పేటీఎం యాప్‌లో ప్రత్యామ్నాయ యూపీఐ ఐడీ లాంటి ఫీచర్లను తీసుకొచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్‌ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ విజయ్ శేఖర్ శర్మ, బోర్డు సభ్యుడు భవేష్ గుప్తా, PPBL సీఈవో సురిందర్ చావ్లాలు కంపెనీ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను ప్రకటించారు. కొత్త ఫీచర్ తో యూజర్లు రూపే క్రెడిట్ కార్డ్‌ను పేటీఎం యాప్‌లో యూపీఐ ఐడీతో లింక్ చేసుకునే వీలు ఉంది. తాజాగా పరిచయం చేసిన ఫీచర్స్ లో ముఖ్యమైనది.. స్ప్లిట్ బిల్. అంటే ఏదైనా బిల్లును ఫ్రెండ్స్ గ్రూప్ లో విభజించి పంచుకోవచ్చు. అలాగే పేటీఎంలో చేసిన అన్ని చెల్లింపులను ట్యాగ్ చేసుకోవచ్చు. అదే విధంగా ట్యాగ్‌ చేసిన చెల్లింపులను ఎప్పుడైనా చూసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన యూపీఐ లైట్ ఫీచర్ తాజాగా యాపిల్ ఐఓఎస్ లో కూడా అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపులను క్రమ బద్ధీకరించడం, చెల్లింపులు ఫెయిల్యూర్ సమస్యను తొలగించడం లాంటివి ఈ ఫీచర్ ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా ప్రస్తుతం పిన్‌తో సంబంధం లేకుండా రూ. 200 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. యూపీఐ లైట్‌కి రోజుకు రెండుసార్లు రూ. 2,000 యాడ్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu