Ad Code

ఆఫీసుకి రాకుంటే కఠిన చర్యలు తప్పవు !


వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధనలను ఉద్యోగులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్  హెచ్చరించింది. వారానికి మూడు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని టీసీఎస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు నెలకు కనీసం 12 రోజుల పాటు కార్యాలయాలకు రావాలని కంపెనీ కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయాలకు హాజరు కాని ఉద్యోగులపై కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్ జారీ చేసిన మెమోలో హెచ్చరించింది. కేటాయించిన రోస్టర్‌కు అనుగుణంగా తక్షణమే ఉద్యోగులందరూ వారి కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని లేటెస్ట్ మెమోలో టీసీఎస్ స్పష్టం చేసింది. రెండేండ్ల కిందట కంపెనీలో చేరిన ఉద్యోగులు పని ప్రదేశం గురించి తెలుసుకుని, మెరుగైన ఫలితాలు అందించేందుకు వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీ ఉపకరిస్తుందని పేర్కొంది. కంపెనీలో చేరిన నూతన ఉద్యోగులు టీసీఎస్ వాతావరణాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సహోద్యోగులతో కలిసి పనిచేస్తూ ఎదిగే అవకాశం అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కంపెనీ ఉద్యోగుల్లో పలువురు కార్యాలయానికి తిరిగి రావడంతో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. నెలలో సగటున వారానికి కనీసం మూడు రోజులు అసోసియేట్‌లందరూ ఆఫీసు నుండి పని చేయడమే మా లక్ష్యమని చెప్పారు. వర్క్ ఫ్రం హోం పాలసీకి ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు.

Post a Comment

0 Comments

Close Menu