Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, June 12, 2023

మైక్రోమాక్స్ ఇన్ 2 సీ స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది !


గత సంవత్సరం ఏప్రిల్ నెలలో మైక్రోమాక్స్ విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇన్ 2C స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. బేస్ వేరియంట్ (3GB + 32GB) ఇప్పుడు కేవలం రూ. 5,999 రూపాయలకే లభిస్తుంది. వాస్తవానికి, ఈ ఫోన్ ను కంపెనీ గత సంవత్సరం రూ.8,499 ధరతో లాంచ్ చేసింది. అంటే, రూ.2,500 రూపాయల భారీ తగ్గింపు ఈ ఫోన్ పైన మైక్రోమ్యాక్స్ అందించింది. 6.52 ఇంచ్ HD+ డిస్ప్లేని కలిగి వుంది మరియు వాటర్ డ్రాప్ డిజైన్ కతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc T610 ఆక్టా కొర్ ప్రొసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 8 MP ప్రధాన సెన్సార్ కలిగిన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరా ఫేస్ బ్యూటీ, Auto HDR, పోర్ట్రైట్ మోడ్, స్లో మోషన్ తో పాటుగా Pro Mode వంటి ఇతర కెమేరా ఫీచర్ లను కూడా కలిగి వుంది. 5000 mah బ్యాటరీని 10W రెగ్యులర్ ఛార్జింగ్ టెక్ తో కలిగి వుంది. సింపుల్ గా చెప్పాలంటే, 6 వేల బడ్జెట్ ధరలో ఈ ఫోన్ డీసెంట్ కెమేరా, బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి వున్న ఫోన్ గా నిలుస్తుంది.https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts