Ad Code

బిజినెస్‌లైట్ ఇన్‌స్టా చార్జ్‌డ్ బై లాగ్9 !

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్‌ 4 గంటలకు పైనే సమయం పడుతుంది. ఫాస్ట్ చార్జింగ్ ఉపయోగిస్తే 2 గంటల వరకు టైమ్ పట్టొచ్చు. ఇలా మీరు ఎలా అయినా కనీసం 2 గంటల పాటు అయినా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 గంటల పాటు వేచి ఉండాలంటే ఓపిక కావాల్సిందే. ఇంట్లో అయితే రాత్రి పూట చార్జింగ్ పెట్టుకోవచ్చు. అదే బయటకు వెళ్లినప్పుడు ఇంత టైమ్ వెయిట్ చేయాలంటే కష్టమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఒక స్టార్టప్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీని తీసుకువస్తోంది. బెంగళూరుకు చెందిన టెక్ అండ్ బ్యాటరీ స్టార్టప్ లాగ్9 మెటీరియల్స్ ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఈవీ తయారీ కంపెనీ క్వాంటం ఎనర్జీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు కంపెనీలు సంయుక్తంగా ఫాస్టెస్ట్ చార్జింగ్ టూవీలర్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్2ను ఆవిష్కరించాయి. దీని పేరు బిజినెస్‌లైట్ ఇన్‌స్టా చార్జ్‌డ్ బై లాగ్9. ఇందులో లాగ్9 ర్యాపిడిస్ 2000 బ్యాటరీస్ టెక్నాలజీతో తయారు చేశారు. 12 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఇరు కంపెనీలు 2024 మర్చి కల్లా 10 వేల ఎలక్ట్రిక్ టూవీలర్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. త్వరలోనే ఇరు కంపెనీలు హైదరాబాద్‌లో 200 బిజినెస్‌లైట్ ఇ2వీలర్లను తీసుకురానున్నాయి. కంపెనీలు దీని కోసం విజ్జీ లాజిస్టక్స్‌తో కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ కస్టమర్లకు ఎలక్ట్రిక్ టూవీలర్లను డెలివరీ చేయనుంది. కాగా క్వాంటం కంపెనీ బిజినెస్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇప్పటికే అందిస్తోంది. బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. ఇది కేవలం 7 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 90 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కంపెనీ ఇందులో 1200 వాట్ మోటార్‌ను అమర్చింది. ఇందులో రిమోట్ లాక్ అన్‌లాక్, రివర్స్ మోడ్, యాంటీ థెఫ్ట్ అలాంరం, బూస్ట్ స్పీడ్, డ్రైవింగ్ మోడ్స్ అనే ఫీచర్లు ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. దీని ధర రూ. 95,865గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. అంటే ఆన్‌ రోడ్ ధర ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి ఉంటాయి. అందువల్ల ధర రూ.లక్ష వరకు చేరొచ్చు. offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu