Ad Code

ఒరాకిల్ లో వందలాది మంది ఉద్యోగుల తొలగింపు !

                                          

అమెరికాకు చెందిన ఒరాకిల్  అకస్మాత్తుగా వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించటంతో ప్రకంపనలు మెుదలయ్యాయి. అయితే కంపెనీ దీనిని ఇక్కడితో ఆపలేదు. కొత్తగా నియమించుకునేందుకు ఉద్యోగులకు ఇచ్చిన జాబ్ ఆఫర్లను సైతం రద్దు చేసింది. ఓపెన్ పొజిషన్‌లను కూడా తగ్గించేసింది. గత ఏడాది డిసెంబరులో ఒరాకిల్ హెల్త్ యూనిట్‌లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నర్‌ను 28.3 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అమెరికాలోని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్ అఫైర్స్ తో సెర్నర్ కు ఉన్న చాలెంజెస్ కారణంగా ఎక్కువగా తొలగింపులు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. తొలగించబడిన ఉద్యోగులకు 4 వారాల జీతంతో పాటు పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా ఒక వారం జీతం, వెకేషన్ డేస్ చెల్లింపులు ఉంటాయని వెల్లడించింది. ఇటీవల కంపెనీ నాలుగో త్రైమాసికంలో అంచనాలకు మించిన లాభాలను నమోదు చేసింది. కొత్త ఏడాది తొలి క్వార్టర్ లో  ఇదే జోష్ కొనసాగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అమలు చేస్తున్న కంపెనీల నుంచి ఒరాకిల్ క్లౌడ్ ఆఫర్‌లకు పెరుగుతున్న డిమాండ్ ఆదాయాల వృద్ధికి కారణంగా కంపెనీ వెల్లడించింది. నాల్గొవ త్రైమాసికంలో ఒరాకిల్ ఆదాయం దాదాపు 17% పెరిగి 13.84 బిలియన్ డాలర్లకు చేరుకోగా క్లౌడ్ ఆదాయం 54% పెరిగి 4.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సెర్నర్ మినహా క్లౌడ్ రాబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం అదే స్థాయిలో పెరుగుతుందని ఒరాకిల్ ఆశిస్తోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu