Ad Code

హెచ్‌పీ నుంచి గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ !


ప్రముఖ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్‌, ప్రింటర్స్ తయారీదారు హెచ్‌పీ క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో ఇండియన్ యూజర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ గేమింగ్ లవర్స్ కోసం చౌకైన గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ తీసుకురావడంపై దృష్టి సారించింది. ఈరోజుల్లో రూ.1 లక్ష వెచ్చిస్తే గానీ అడ్వాన్స్‌డ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ల్యాప్‌టాప్స్‌ దొరకడం లేదు. దీనివల్ల బడ్జెట్ గేమింగ్ లవర్స్‌ నిరాశ పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హెచ్‌పీ రూ.60 వేల రేంజ్‌లో బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ ఇండియన్ మార్కెట్‌కి తీసుకొస్తామని ప్రకటించడంతో వారిలో జోష్‌ నింపినట్లు అయింది. హెచ్‌పీ కంపెనీ తన కొత్త గేమింగ్ సిరీస్‌ను ఈ వారం చివరి నాటికి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. రూ.60 వేల బడ్జెట్‌లో తేలికైన, సన్నని గేమింగ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న కొనుగోలుదారులకు ఇవి ఉత్తమ ఎంపికగా నిలవనున్నాయి. వివిధ రకాల అవసరాలను తీర్చే గేమింగ్ డివైజ్‌లు కోరుకునే గేమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హెచ్‌పీ తన అప్‌కమింగ్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ రిలీజ్ చేస్తోంది. వీటి ద్వారా ఇండియన్ పీసీ గేమింగ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ గా అవతరించాలని భావిస్తోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదించిన ప్రకారం, భారతీయ పీసీ మార్కెట్లో హెచ్‌పీ 33 శాతం వాటాతో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కొత్త ల్యాప్‌టాప్‌లతో ఈ వాటా మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రొఫెషనల్ గేమర్‌ల కోసం సరసమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ గాడ్జెట్ డిస్కవరీ సైట్ అయిన 91మొబైల్స్ చేసిన 'ల్యాప్‌టాప్ బయర్స్‌ ఇన్‌సైట్స్‌' సర్వే ప్రకారం, HP, Dell భారతీయ ల్యాప్‌టాప్ పరిశ్రమలో బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి. HP 33.2 శాతం అమ్మకపు వాటాను కలిగి ఉండగా, డెల్ 23.1 శాతంతో ఆధిపత్యాన్ని చలాయిస్తోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu