Ad Code

లక్షకు పైగా ఫోర్డ్ ఎస్‌యూవీలు, ట్రక్కులు రీకాల్


వాహనాల తయారీ కంపెనీలు తమ వెహికల్స్‌లో ఉన్న సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కస్టమర్ల ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు కంపెనీలు ఈ చర్యలు చేపడతాయి. అయితే రీసెంట్‌గా దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ మోటార్ కి చెందిన ఎస్‌యూవీలు, ట్రక్కులలో ఒక పెద్ద సమస్య బయటపడింది. వీటిలో ఇంజన్ ఫెయిల్యూర్స్‌ కారణంగా మంటలు సంభవించే ప్రమాదం ఉందని కంపెనీ గుర్తించింది. దీంతో వెంటనే ఒక లక్ష 25 వేల ఎస్‌యూవీలు, ట్రక్కులను రీకాల్ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఫోర్డ్ 2020 - 2023 మధ్య తయారు అయిన ఎస్కేప్, లింకన్ కోర్సెయిర్ SUVల నిర్దిష్ట మోడళ్లను, అలాగే మావెరిక్ కాంపాక్ట్ పికప్ ట్రక్కులను రీకాల్ చేస్తోంది. ఈ మోడల్స్‌లో అందించిన 2.5L హైబ్రిడ్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్‌లలో కొన్ని తయారీ సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ సమస్యలు చాలా తక్కువ కాలంలో ఇంజన్ వైఫల్యాలకు దారితీస్తాయని ఫోర్డ్ పేర్కొంది. ఇంజన్ ఫెయిల్యూర్ కావడం వల్ల ఆయిల్ లేదా ఇంధన ఆవిరి ఎక్కువగా విడుదల అవుతుందని, ఇది అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తుందని, గాయాల ప్రమాదాన్ని పెంచుతుందని ఫోర్డ్ చెప్పుకొచ్చింది.offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu