Ad Code

శామ్ ఆల్ట్‌మన్‌కు సీపీ గుర్నానీ సవాల్


భారత కంపెనీలు చాట్‌జీపీటీ టూల్స్ రూపొందించలేవన్న ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్‌మన్‌కు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ గట్టి సవాల్ విసిరారు. భారత్ కంపెనీలు ఏఐ టూల్ రూపొందిస్తాయని సంకేతాలిచ్చారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్‌ చాట్‌జీపీటీపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఓపెన్‌ ఏఐ ఆధ్వర్యంలో టెక్నాలజీ ప్రపంచంలోకి ఎంటరైన చాట్‌జీపీటీ.. గ్లోబల్‌టెక్‌ దిగ్గజాలకు ప్రత్యేకించి సెర్చింజన్‌ గూగుల్‌కు సవాల్‌ విసిరింది. కానీ, ఇప్పుడు చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ ఏఐ వ్యవస్థాపకుడు శామ్‌ ఆల్ట్‌మన్‌ చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. శామ్‌ ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యపై భారత్‌ ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ తీవ్రంగా స్పందించారు. చాట్‌జీపీటీ తరహా టూల్స్‌ను భారత్‌ ఐటీ సంస్థలు రూపొందించలేవన్న శామ్‌ ఆల్ట్‌మన్‌ చాలెంజ్‌ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆరు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఓపెన్‌ ఏఐ ఫౌండర్‌, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌.. ఢిల్లీలో జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడారు. గూగుల్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏసియా వైస్‌ప్రెసిడెంట్‌ రాజన్‌ ఆనంద్‌ చర్చాగోష్టిలో పాల్గొంటూ.. ఇండియాలో స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం ఉందని, ఈ స్టార్టప్‌ల్లో ఏదైనా చాట్‌జీపీటీ తరహా ఫౌండేషన్‌ మోడల్‌ అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తుందా? అని శామ్‌ ఆల్ట్‌మన్‌ను ప్రశ్నించారు. దీనిపై శామ్‌ ఆల్ట్‌మన్‌ రియాక్టవుతూ.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్స్‌ అడ్వాన్స్‌మెంట్‌, ట్రైనింగ్‌ ఫౌండేషన్‌ మోడల్స్‌ పరిశోధనపై భారత్‌ కంపెనీలు పోటీ పడటం వృధా అని అభిప్రాయ పడ్డారు. సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో భారత్‌ కంపెనీలు పోటీ పడలేవని వ్యాఖ్యానించారు. దీనిపై టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ తీవ్రంగా ప్రతిస్పందించారు. శామ్‌ ఆల్ట్‌మన్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. 'సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో భారత్‌ స్టార్టప్‌లు, టెక్‌ సంస్థలు పోటీ పడటం నిరాశాజనక ఫలితాలనే ఇస్తుందని, సిలికాన్‌ వ్యాలీ కంపెనీలతో పోటీ పడలేవని ఓపెన్‌ ఏఐ ఫౌండర్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ చేసిన సవాల్‌ను ఒక సంస్థ సీఈఓగా స్వీకరిస్తున్నానని సీపీ గుర్నానీ తెలిపారు. గూగుల్‌ ఇండియా, సౌత్‌ ఈస్ట్‌ ఏసియా వైస్‌ప్రెసిడెంట్‌ రాజన్‌ ఆనందన్‌ సైతం శామ్‌ఆల్ట్‌మన్‌ వ్యాఖ్యపై రియాక్టయ్యారు. చాట్‌జీపీటీ తరహా టూల్‌ నిర్మించే సత్తా భారత్‌కు లేదని శామ్‌ ఆల్ట్‌మన్‌ పేర్కొన్నా.. భారత పారిశ్రామికవేత్తలు సొంతంగా ఏఐ చాట్‌బోట్‌ టూల్‌ తయారీకి ప్రయత్నిస్తారని ట్వీట్‌ చేశారు. ఐదువేల సంవత్సరాల చరిత్ర గల భారత పారిశ్రామిక రంగాన్ని తక్కువ అంచనా వేయొద్దని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu