Ad Code

దేశీయ మార్కెట్లోకి త్వరలో రానున్న ఒప్పో ఏ78 4జీ !


దేశీయ మార్కెట్లో ఒప్పో ఏ78 4జీ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. గత జనవరిలో ఒప్పో ఏ78 5జీ ఫోన్ రూ.18,999లకే మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో ఏ78 4జీ ఫోన్ ధర రూ.18 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండొచ్చునని వార్తలొస్తున్నాయి. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రావచ్చు. ఇంతకుముందు ఇండోనేషియాలో బ్లాక్ మిస్ట్, సీ గ్రీన్ కలర్స్‌లో 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ఆవిష్కరించారు. 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080 x2400 పిక్సెల్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుందని భావిస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్, 8 జీబీ రామ్ (వర్చువల్‌గా 16 జీబీ వరకు పొడిగించవచ్చు) విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్‌తో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఒప్పో ఏ78 4జీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది. వై-ఫై, బ్లూ టూత్ 5.3, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu