Ad Code

'థ్రెడ్స్' పై దావా వేస్తాం !


ట్విట్టర్ మాజీ ఉద్యోగులను మెటా చేర్చుకొని, వాణిజ్య రహస్యాలను తెలుసుకొని, ట్విట్టర్‌కు కాపీక్యాట్ అప్లికేషన్‌ను రూపొందించిందని ఆరోపిస్తూ ట్విట్టర్ న్యాయవాది అలెక్స్ స్పిరో దావా వేయడానికి సిద్ధమయ్యారని సెమాఫోర్ రిపోర్ట్ వెల్లడించింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు జులై 6న పంపిన లేఖలో ట్విట్టర్ న్యాయవాది అలెక్స్ స్పిరో దావా వేస్తామని బెదిరించారు. ఆ లేఖలో "ట్విట్టర్ వ్యాపార రహస్యాలు, ఇతర మేధో సంపత్తిని క్రమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా, చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేయడంలో మెటా నిమగ్నమైందని" ఆరోపించారు. ట్విట్టర్ రహస్య సమాచారం వాడకాన్ని తక్షణమే ఆపివేయాలని, దాని వల్ల కలిగే హానిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని మెటాను స్పిరో డిమాండ్ చేశారు. ట్విట్టర్ ఇంటెలిజెన్స్ ప్రాపర్టీ ఉల్లంఘనను కంపెనీ అసలు సహించబోదని లేఖలో స్పష్టం చేశారు. ట్విట్టర్ వ్యాపార రహస్యాలను యాక్సెస్ చేసిన మాజీ ట్విట్టర్ ఉద్యోగులను మెటా నియమించుకున్నట్లు ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ బెదిరించడాన్ని బట్టి చూస్తుంటే మెటా ఛాలెంజ్‌ను మస్క్ తేలికగా తీసుకోవడం లేదని అర్థమవుతోంది. ఒకవేళ రెండు కంపెనీలు కోర్టుకు వెళితే, కేసు చాలా కాలం పాటు కొనసాగవచ్చు. రెండు కంపెనీలకు భారీగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. సోషల్ మీడియా భవిష్యత్తుపై కూడా పెను ప్రభావం పడొచ్చు. థ్రెడ్స్‌ యాప్ ట్విట్టర్ అందిస్తున్న దాదాపు అన్ని సేవలను ఆఫర్ చేస్తోంది. ఇది ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ డేటా ప్రైవసీ సమస్యల కారణంగా యూరోపియన్ యూనియన్‌లో లాంచ్ కాలేదు. దీనికంటే ముందు మాస్టోడాన్, బ్లూస్కై ట్విట్టర్‌కి పోటీగా లాంచ్ అయ్యాయి. కానీ అవేమీ ఇంటర్‌ఫేస్‌ను కాపీ చేయలేదని, మెటా లాంచ్ చేసిన కొత్త యాప్ థ్రెడ్స్‌ మాత్రమే ట్విట్టర్‌ను పోలి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత బలమైన పోటీ ఇస్తున్న థ్రెడ్స్‌కు దీటుగా నిలిచేందుకు మస్క్ ట్విట్టర్‌లో మార్పులు చేయాలని యోచిస్తున్నారని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ సీఈఓ మెటా కొత్త థ్రెడ్స్ యాప్‌ని విమర్శించారు. ట్విట్టర్ కమ్యూనిటీని డూప్లికేట్ చేయలేరని చెప్పారు. చారిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యమివ్వడంలో, రియల్-టైమ్‌ ఇన్ఫర్మేషన్‌ అందించడంలో, అభిప్రాయాలను పంచుకోవడంలో, సంఘాన్ని పెంపొందించడంలో ట్విట్టర్ పాత్రను ఆమె హైలెట్ చేశారు. ట్విట్టర్ ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్ అని, ఇతరులు కాపీ చేయడానికి ప్రయత్నించినా వారు దాని కమ్యూనిటీని ఎప్పటికీ రీక్రియేట్ చేయలేరని ఆమె అన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu