Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, August 22, 2023

24న మోటో జి 14 విడుదల !


మోటరోలా తన మోటో జీ14 ఫోన్ మరో రెండు కలర్స్ బట్టర్ క్రీమ్, పాలె లిలాక్ ఆప్షన్లలో రాబోతున్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ నెల 24న ఆవిష్కరించనున్నారు. మోటో జి 14 ఫోన్ 4జీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ బడ్జెట్ సెగ్మెంట్‌లో రూ.9,999లకే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 విత్ కంపెనీ మై యూఎక్స్ వర్షన్ మీద ఫోన్ పని చేస్తుంది. 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ+ (1080×2400 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ 405 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తున్నది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్‌సెట్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (పీడీఏఎఫ్), సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 2-మెగా పిక్సెల్స్ మాక్రో కెమెరా ఉంటుంది. 20వాట్ల టర్బో పవర్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్-బాండ్ వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

No comments:

Post a Comment

Popular Posts