Ad Code

హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ !


హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లలో హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ కూడా ఒకటి. దీని ధర తక్కువగానే ఉంది. అలాగే ఫీచర్లు కూడా బాగున్నాయి.  హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 86,540గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఇది బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇన్‌డ్యాష్ బాటిల్ హోల్డర్, స్ల్పిట్ ఫోల్డింగ్ సీటు, కాంబీ బ్రేక్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, పోర్టబుల్ బ్యాటరీ, అలాయ్ వీల్స్, యూఎస్‌బీ పోర్ట్, టెలీ స్కోపిక్ సన్సెన్షన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫుల్ కావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. మోటార్ పవర్ 1350 వాట్స్. క్రూయిజ్ కంట్రోల్ లేదు. డబుల్ బ్యాటరీ ఉంటుంది. దీని కెపాసిటీ 30 ఏహెచ్. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 138 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. 20 పైసలుతో కిలోమీటర్ వెళ్లొచ్చు. అటే రూ.10 ఖర్చుతో 50 కిలోమీటర్లు వెళ్లొచ్చని చెప్పుకోవచ్చు. కంపెనీ ఆప్టిమా సీఎక్స్ 2.0 మోడల్ అదిస్తోంది. దీని ధర రూ. 1.06 లక్షలు. అలాగే ఆప్టిమా సీఎక్స్ 5.0 మోడల్ కూడా ఉంది. దీని ధర రూ.1.29 లక్షలు. ఇక హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ ఎల్‌పీ మోడల్ కూడా ఉంది. దీని ధర రూ.1.10 లక్షలు. ఈ స్కూటర్లు అన్నింటికీ టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు ఉంటుంది. అయితే స్కూటర్ రేంజ్ మాత్రం మారుతూ ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu