Ad Code

ట్రూకాలర్‌లో ఏఐ ఫీచర్‌ !


డ్రైవింగ్ చేస్తున్న సమయంలోనో, ఇతర సందర్భాల్లోనే ఎవరైనా ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం కుదరదు. అయితే ఇలా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేని పరిస్థితుల్లో ఉపయోగపడుతుందీ కొత్త ఫీచర్‌. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా పనిచేసే ఈ కొత్త ఫీచర్‌ మీరు కాల్‌ లిఫ్ట్‌ చేయలేని పరిస్థితుల్లో అవతలి వ్యక్తికి సమాధానం చెబుతుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఇతర స్థానిక భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ ఫీచర్‌నె ఎలా ఉపయోగించుకోవాలంటే. ఇందుకోసం యాప్‌లో ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో కనిపించే ట్రూకాలర్‌ అసిస్టెంట్‌ను ఎనెబుల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయగానే ఫోన్‌ కాల్‌ వచ్చినప్పుడు ట్రూకాలర్‌ అసిస్టెంట్ ఫోన్‌ మాట్లాడుతుంది. ఒకవేళ ఏఐ యాక్టివేట్‌ అయ్యి అవతలి వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో యూజర్‌ మధ్యలో ఇంటరాక్ట్‌ అయ్యి స్వయంగా మాట్లాడొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu